ఆరోపణల్ని ఖండించకుండా దీపిక షోరూమ్ లాంచ్ కి!

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తీగ లాగితే డొంకంతా కదిలిపోతోంది. బాలీవుడ్ టాప్ స్టార్ల పేర్లన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్ పేరును మీడియా హైలైట్ చేయడంతో హర్టయి దానికి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రకుల్ ఆ ఆరోపణల గురించి ఆలోచించకుండా హైదరాబాద్ లో క్రిష్ తో పాటు షూటింగులో పాల్గొంటున్నారు. సారా అలీ ఖాన్.. శ్రద్ధా కపూర్లను ఎన్సిబి అధికారులు పిలిపించి త్వరలో విచారించనున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి.

ఇదిలా ఉండగా దీపిక పదుకొనేకు సమన్లు అందనున్నాయంటూ ఊహాగానాల్ని జాతీయ మీడియాలు హైలైట్ చేయడం సంచలనమైంది. అయితే ఈ విషయం తన దృష్టికి వచ్చాక దానిపై ఏదైనా అధికారిక ప్రకటన చేయాలని దీపిక భావిస్తోందట. అయితే అదంతా అసత్య ప్రచారమని ఖండిస్తుందా? లేక ఎలా తనని తాను డిపెండ్ చేసుకుంటుంది? అంటూ చర్చ సాగుతోంది. మరోవైపు దీపిక ఈ ప్రచారమేదీ పట్టించుకోకుండా చెన్నయ్ లో ఓ షోరూమ్ రిబ్బన్ కటింగ్ కి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

డ్రగ్స్ కేసులో దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ ను ఎన్.సి.బి వాళ్లు పిలిపించారనే వార్తలను బాలీవుడ్ లోని కొన్ని టాప్ చానెల్స్ ప్రచారం చేయడంతో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహా పేరు కూడా ఇప్పటికే ఇందులో పాపులరవుతోంది. రియా చక్రవర్తి ఆమె సోదరుడు సోయిక్ నుంచి ఎన్.సి.బి చాలా వరకూ సమాచారం తెలుసుకుంది. అందులో స్టార్ల పేర్లు లీకయ్యాయన్న ప్రచారం సాగుతోంది. ఇక తాజా పరిణామం నేపథ్యంలో దీపిక సహా స్టార్లంతా తమపై ఊహాగానాల్ని కొట్టి పారేసేందుకు మీడియా ముందుకు వస్తారా రారా? అన్న చర్చా వేడెక్కిస్తోంది.