నేను మొదట చూసిన స్టార్ హీరో అతడే : రష్మిక మందన్నా

0

రష్మిక మందన్నా.. టాలీవుడ్ లో వరుస విజయాలతో అగ్ర కథానాయకిగా పేరు పొందింది. సీనియర్ హీరోయిన్లంతా ఫేడ్ అవుట్ అవడంతో ఇప్పుడంతా రష్మిక హవా నడుస్తోంది. అగ్ర హీరోలు అంతా వరుసగా ఆమెకు ఆఫర్లు ఇస్తున్నారు. కన్నడంలో ఆమె చేసిన ‘ కిర్రాక్ పార్టీ ‘సంచలన విజయం సాధించింది. దీంతో ఆమె అక్కడ బిగ్ స్టార్ గా మారింది. తెలుగులో ఆమె విజయ్ దేవరకొండతో చేసిన ‘ గీత గోవిందం ‘ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె విజయ్ దేవరకొండతోనే ‘డియర్ కామ్రేడ్’ లోనూ మెరిసింది. అనతి కాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే ఛాన్స్ అందుకొని ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన పుష్ప సహా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇటీవల రష్మిక తాను సినిమాల్లోకి రాక ముందు మొదటిసారి చూసిన స్టార్స్ గురించి ఆసక్తికర సంగతులు చెప్పింది. ‘స్టార్లు ఎలావుంటారు.. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనే అనే విషయాలు తెలుసుకోవడానికి నాకు ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఇష్టమైన హీరో హీరోయిన్ల గురించి పేపర్లోనో టీవీలోనో వస్తే ఆసక్తిగా చూసే దాన్ని. ఒక్క సినిమా షూటింగ్ అయినా చూడాలని ఉండేది. అయితే ఒక్కసారి కూడా ఆ అవకాశం రాలేదు. నేను బెంగుళూరులో చదువుకునే రోజుల్లో ‘ ఫ్రెష్ ఫేస్ ‘ అనే ప్రోగ్రామ్ కి హాజరు కాగా అక్కడికి కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోయిన్ కృతి కర్బందా వచ్చారు. నేను స్టార్ హీరోని చూడడం అదే మొదటిసారి. ఆ తర్వాత ఓసారి ముంబై వెళ్ళినప్పుడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రానాను చూశా ‘ అని రష్మిక వివరించింది.