డిప్రెషన్ కి కారణం: సుశాంత్ కేసులో నటవారసురాలి లింకులు?

0

సుశాంత్ బలవన్మరణ కేసులో రోజుకో ట్విస్టు బయటపడుతోంది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐకి బదలాయించిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ సింగ్ స్నేహితులు ఈ కేసు విషయంలో రకరకాల విషయాల్ని వెల్లడిస్తూ షాక్ లిస్తున్నారు. అసలు సుశాంత్ సింగ్ ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళాడనే దాని గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. కానీ ఎక్కడా ఆ హీరోయిన్ పేరు మాత్రం వినిపించలేదు. ఇప్పుడు సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ తన ఇన్ స్టా పోస్ట్ లో సారా అలీ ఖాన్ తో విడిపోవటం సుశాంత్ నిరాశకు ఒక కారణమని రాయడం వేడెక్కించింది.

తన తాజా పోస్ట్ లో శామ్యూల్ ఇలా ఏమన్నాడంటే.. “కేదార్నాథ్ ప్రమోషన్ల సమయంలో జరిగినది ఒకటి నాకు గుర్తుంది… సుశాంత్ – సారా పూర్తిగా ప్రేమలో ఉన్నారు… వారు విడదీయరాని బంధంతో ఉన్నారు… స్వచ్ఛమైన పిల్లలలాంటి అమాయకత్వం వారిది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో సంబంధాలలో ఇలాంటివి చూడటం చాలా అరుదు” అని వ్యాఖ్యానించాడు.

సుశాంత్ `సోంచారియా` మూవీ పరాజయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని అతడి నుంచి సారా విడిపోయిందట. అంతేకాదు.. సుశాంత్ లాంటి హీరోల నుండి దూరంగా ఉండాలని కోరుకునే మాఫియా ఒత్తిడి కారణంగా ఆమె ఇలా చేసి ఉండవచ్చు.. అంటూ సందేహిస్తూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు.

దీనిని బట్టి సుశాంత్ సింగ్ తన జీవితంలో ఫెయిల్యూర్ పరంగా చాలా దూరం వెళ్ళాడని ఇది స్పష్టంగా చూపిస్తోంది. వీటన్నిటికీ రుజువు లేనప్పటికీ.. ఇలాంటివి ఒకదాని తరువాత ఒకటి బయటకు రావడం చాలా సందేహాలను సృష్టిస్తోంది. అయితే అప్పట్లోనే ఓ టీవీ చానెల్ లైవ్ ఇంటర్వ్యూలో అసలు సుశాంత్ లాంటి చెత్త ముఖాన్ని ప్రేమించవద్దని సారా అలీఖాన్ కి కరీనాకపూర్ సూచించడం వేడెక్కించింది. సరదాగా కామెంట్ చేసినా అది సీరియస్ అయ్యింది. సుశాంత్ మరణానంతరం దీనిపై అభిమానులు రకరకాల ప్రశ్నల్ని సంధించారు. ఇక సుశాంత్ మరణం తర్వాత తొలిగా స్పందించిన ఏకైక ఖాన్ సైఫ్ అలీఖాన్. నటవారసుల్ని తిట్టేయడం.. కరీనాను తిట్టేయడంతో అతడు లైన్ లోకి వచ్చి.. అప్పుడే దీని గురించి ఇలా మాటలు జారడం సరికాదని సూచించే ప్రయత్నం చేశాడు. మొత్తానికి సారాతో సుశాంత్ లవ్వాయణం లో వైఫల్యం కూడా అతడి మానసిక కుంగుబాటుకు కారణం అయ్యుంటుందా? అంటే .. ఒకానొక కారణం కావొచ్చని అభిమానులు భావిస్తున్నారు.