Templates by BIGtheme NET
Home >> Cinema News >> నెపొటిజం తప్పే కాదంటున్న బ్యూటీ

నెపొటిజం తప్పే కాదంటున్న బ్యూటీ


బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం దేశంలో ఉన్న ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనది అంటూ హీరోయిన్ కంగనా రనౌత్ విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. నెపొటిజం వల్లే సుశాంత్ మృతి చెందాడు అంటూ ఆమె బలంగా నమ్మతుంది. బాలీవుడ్ లో ఉన్న మాఫియా నెపొటిజం వల్ల కొత్త వారిని ఎదిగేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. కేవలం స్టార్ వారసులను మాత్రమే సినిమాలకు తీసుకు రావడం వారితోనే సినిమాలు చేయడం చేస్తున్నారు. కనుక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది స్టార్ కిడ్స్ అంటూ కంగనా వ్యాఖ్యలు చేస్తోంది. ఆమెను సమర్థించే వారు ఉన్నారు… అదే సమయంలో ఆమె వాదనను కొట్టి పారేసేవారు ఉన్నారు.

కంగనా వ్యాఖ్యలకు గతంలో తాప్సి పలు సార్లు విభేదించింది. బాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోయిన్ తాప్సి. కనుక కంగనా వ్యాఖ్యలకు ఎక్కువ సార్లు వ్యతిరేకించింది తాప్సి అనే విషయం తెల్సిందే. కంగనా నెపొటిజం గురించి చేస్తున్న వ్యాఖ్యలపై తాప్సి మరోసారి స్పందించింది. ఈసారి ఆమె చెప్పిన వివరణ చాలా మంది ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా కంగనా బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం ను ఉగ్రవాదంతో పోల్చడంను తాప్సి తప్పుబట్టింది. కంగనా వంటి వారు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఇండస్ట్రీలో ఉన్న నెపొటిజంను మాత్రం పోగొట్టలేరు. కేవలం సినిమా పరిశ్రమలోనే కాకుండా అన్ని చోట్ల కూడా ఈ నెపొటిజం అనేది ఉందని తాప్సి పేర్కొంది.

నిర్మాతలు దర్శకులు తమ సినిమాలను ప్రేక్షకులు చూడాలని డబ్బులు రావాలని కోరుకుంటారు. అందుకే క్రేజ్ ఉన్న స్టార్స్ కిడ్స్ ను తమ సినిమాల్లో నటింపజేయాలనుకుంటారు. వ్యాపారకోణంలోనే తప్ప దాంట్లో ఏదో లేదని.. కొత్త వారిని తొక్కేసే ఉద్దేశ్యం అస్సలు ఉండదనేది తన అభిప్రాయం అంటూ తాప్సి పేర్కొంది. స్టార్స్ కిడ్స్ అయినా కూడా కేవలం ప్రతిభ ఉంటేనే స్టార్స్ అవుతారు. ప్రతిభ లేని వారిని ఎంతగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాదు.

ఇప్పుడు సుశాంత్ మృతికి నెపొటిజం కారణం అంటున్న వాళ్లు వారి వారి రంగాల్లో తమ కుటుంబ సభ్యులకు ప్రాముఖ్యత ఇస్తున్నారో లేదో వారికి వారే ప్రశ్నించుకోవాలంటూ తాప్సి ప్రశ్నించింది. సినిమా అనేది కేవలం వ్యాపారంగా మాత్రమే వారు చూస్తున్నారు తప్ప బందు ప్రీతితో ఎవరు కూడా సినిమాలు స్టార్ కిడ్స్ తో చేయడం లేదు. కేవలం సినిమాలకు క్రేజ్ వస్తుందనే ఉద్దేశ్యంతో చేస్తారని తాప్సి అంది.