Templates by BIGtheme NET
Home >> Cinema News >> తిమ్మరుసు టీజర్ టాక్

తిమ్మరుసు టీజర్ టాక్


టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ”తిమ్మరుసు”. ‘అసైన్మెంట్ వాలి’ అనేది దీనికి ఉపశీర్షిక. ‘కిర్రాక్ పార్టీ’ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు – సృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘తిమ్మరుసు’ సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకుంది. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు ఒక మంత్రి అనే విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రిలీజ్ చేశారు.

‘తిమ్మరుసు’ టీజర్ తోనే ఇందులో సత్యదేవ్ క్యారక్టర్ ఎలా ఉంటుందనేది వెల్లడించారు. న్యాయం గెలవడానికి ఎంత దూరమైనా వెళ్లే లాయర్ పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నాడు. “కేసు గెలిచామా ఓడామా అన్నది కాదు ఇంపార్టెంట్.. సంపాదన ఎంతనేదే ఇంపార్టెంట్” అని ఓ వ్యక్తి అంటుండగా.. “నాకు మాత్రం న్యాయం జరగడమే ఇంపార్టెంట్ సార్” అని హీరో సత్యదేవ్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ టీజర్ కి శ్రీ చరణ్ పాకల అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్.. మరోసారి ఛాలెంజింగ్ రోల్ లో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో బ్రహ్మాజీ – అజయ్ – ప్రవీణ్ – ఆదర్శ్ బాలకృష్ణ – ఝాన్సీ – వైవా హర్ష – సంధ్యా – జనక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.