బాలీవుడ్ బాహుబలుడు 220కేజీలు ఎత్తాడు

0

ఒకప్పుడు హీరోలతో పోల్చితే ప్రస్తుతం ఉన్న హీరోలు ముఖ్యంగా స్టార్ హీరోలు హోం వర్క్ చాలా ఎక్కవుగా చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వారి ఫిజిక్ మరియు అందంను కాపాడుకునేందుకు హీరోలు చాలా రిస్క్లు చేస్తున్నారు. క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేయడం హీరోలు అలవాటుగా పెట్టుకోవడంతో పాటు సిక్స్ ప్యాక్ లను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ కొత్త కండల వీరుడిగా పేరు దక్కించుకున్న టైగర్ ష్రాఫ్ తాజాగా చేసిన ఫీట్ కు అంతా ఫిదా అవుతున్నారు.

సహజంగానే జిమ్ లో ఎక్కువ సమయం గడిపే టైగర్ ష్రాఫ్ ఈ లాక్ డౌన్ టైం మొత్తం జిమ్ లోనే వర్కౌట్స్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఈయన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో టైగర్ ఏకంగా 220 కేజీల బరువును ఎత్తాడు. వంద కేజీల వరకు సరే పర్వాలేదు అనుకోవచ్చు. 150 కేజీలు అంటే బాబోయ్ అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఏకంగా 220 కేజీల బరువును ఎత్తడం అంటే మామూలు విషయం కాదు. టైగర్ ఆ ఫీట్ ను సాధించాడు.

అతడు పెట్టిన వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది. దాదాపుగా అయిదు మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న ఈ వీడియోకు సినీ ప్రముఖులు సైతం స్పందిస్తూ అభినందించారు. ఆయన స్నేహితురాలు దిశా పటానీ కూడా వీడియోపై రియాక్ట్ అయ్యింది. చప్పట్లు కొడుతూ వావ్ అంది.

Excuse the war cries…that felt heavy af😅 @rajendradhole #220kgsdeadlift

null