Templates by BIGtheme NET
Home >> Cinema News >> క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ‘మేకసూరి’ డైరెక్టర్..!

క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ‘మేకసూరి’ డైరెక్టర్..!


ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘జీ 5’ వేదికగా విడుదలైన క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ ఫిల్మ్ ”మేకసూరి”. పల్లెటూరి వాతావారణంలో ఫ్యాక్షన్ పగ ప్రతీకారాల నేపథ్యంతో రూపొందిన ఈ మూవీ రెండు భాగాలుగా వచ్చింది. రెండు పార్ట్స్ కూడా ఓటీటీ ఆడియన్స్ నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇక ‘మేకసూరి’ ని డైరెక్ట్ చేసిన త్రినాథ్ వెలిశిల ను ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు విమర్శకులు సైతం అభినందిస్తున్నారు. ఒక్క వెబ్ మూవీ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన త్రినాథ్ కి ఇప్పుడు ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయని తెలుస్తోంది.

త్రినాథ్ వెలిశిల ఇంతకుముందు ‘మోసగాళ్లకు మోసగాడు’ ‘ఒక్క క్షణం’ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా.. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాకి అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేసాడని తెలుస్తోంది. ఇప్పుడు ‘మేకసూరి’ తో దర్శకుడిగా పరిచయమై ఫస్ట్ ప్రాజెక్ట్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పలాస’ వంటి కల్ట్ సినిమా తీసి ‘ఆహా’ లో ఛాన్స్ దక్కించుకున్న కరణ్ కుమార్ మాదిరి ఇప్పుడు త్రినాథ్ కి కూడా ఆహా వారు అవకాశం ఇవ్వబోతున్నారని సమాచారం. అలానే పలువురు ప్రొడ్యూసర్స్ త్రినాథ్ తో సినిమా చెయ్యడానికి డిస్కషన్స్ చేస్తున్నారని తెలుస్తోంది.