వెంకీ.. తరుణ్ ల మూవీ అప్ డేట్

0

విక్టరీ వెంకటేష్ హీరోగా ‘పెళ్లి చూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ గత ఏడాది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని సురేష్ బాబు ఓకే చెప్పారు. స్క్రిప్ట్ చర్చలు కూడా పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను వెంకీ డేట్ల కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి కాంబో మూవీకి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. వెంకీ ప్రస్తుతం చేస్తున్న నారప్ప సినిమా పూర్తి అయిన వెంటనే ఎఫ్ 3 సినిమాలో నటించేందుకు ఇప్పటికే డేట్లు ఇచ్చేశాడు.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెంకీకి చాలా కాలం తర్వాత మంచి సక్సెస్ పడింది. అందుకే మరోసారి అనీల్ రావిపూడికి వెంకీ డేట్లు ఇవ్వాలని భావిస్తున్నాడు. ఎఫ్ 3 సినిమాతో మరోసారి ఖచ్చితంగా తనకు అనీల్ సక్సెస్ ను ఇస్తాడనే నమ్మకంతో వెంకీ ఉన్నాడు. అందుకే తరుణ్ భాస్కర్ ను మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందిగా సూచించాడట.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఎఫ్ 3 సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత అంటే వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత లేదా దసరా వరకు అయినా మొదులు పెట్టే అవకాశం ఉంది. అంటే 2022లో వెంకీ తరుణ్ భాస్కర్ ల మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న తరుణ్ భాస్కర్ ఈ సినిమాను గుర్రపు పందేలా నేపథ్యంలో రూపొందించబోతున్నాడు. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కు మరియు ఆయన ఇమేజ్ కు సరిగ్గా సూట్ అయ్యే కథ అవ్వడం వల్ల సురేష్ బాబు వెంటనే ఒప్పుకున్నాడట. తానే స్వయంగా సినిమాను నిర్మించేందుకు కూడా ముందుకు వచ్చాడు. కాని వెంకీ డేట్లు అడ్జస్ట్ కాకపోవడం వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది.