సెక్స్ లో ఈ ఐదు మీ కొంప కొల్లేరు చేసే ఛాన్స్ ఉందట!

0

భారతీయులలో మెజారిటీ జనాలు సెక్స్ అనే పదం ఎత్తగానే ‘పాపం’ అన్నట్టుగా ఎందుకు చూస్తారు? ఇతర విషయాల లాగా సెక్స్ అంశాలను ఎందుకు చర్చించరు. దీనికి ఎక్కువమంది చెప్పే కారణం మనది సంప్రదాయ సమాజం అంటారు. అలా అనుకుని.. అనుకునే మన కొంప మనమే కొల్లేరు చేసుకున్నాం. ఇప్పుడు మన జనాభా 133 కోట్లని గూగులమ్మ చెప్తోంది. సెక్సు గురించి ఏం తెలియకుండానే.. దాంతో పని లేకుండా ఇంత జనాభా ఆకాశం నుంచి ఊడిపడిందా? నిజానికి సెక్సు గురించి.. దానికి సంబంధించిన ఇతర అంశాల గురించి ఓపెన్ గా చర్చలు జరిగితే తప్ప మన సమాజం మారదు. అలా కాదు మేము సెక్సు గురించి మాట్లాడము..కానీ కంటిన్యూగా పిల్లల్ని కంటూనే ఉంటాము అంటే ఇక చేసేదేం లేదు.. తూర్పు తిరిగి ఓ దండం పెట్టడం తప్ప.

సరే జనాభా అనేది ఒక హాట్ టాపిక్. కాస్త వివాదాస్పదమైనది కూడా. అందుకే ఇక్కడితో దాన్ని వదిలేసి కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టిప్స్ “సెక్సులో ఎలా రెచ్చిపోవచ్చు?”.. “రతిక్రీడలో రచ్చ ఎలా.. పార్టనర్ ను స్వర్గ లోకపు అంచుల దాకా తీసుకెళ్ళడం ఎలా?” అనే ఎవర్ గ్రీన్ టాపిక్ పైన కాదు. రతి సమయంలో మీరు ఏం చేయకూడదో.. ఎక్కడ చేయకూడదు అనే అంశాలపైన.

1. డ్రైవింగ్ లో సెక్స్: ఇది మేమెప్పుడూ వినలేదు అంటే మీరు ఈ జెనరేషన్ కాదన్నమాట. ఈ జెనరేషన్లో చాలామంది కార్ డ్రైవ్ చేస్తూ సెక్స్ చేస్తున్నారట. కొందరు మహాత్ములు డ్రైవింగ్ లో ఫుల్ సెక్స్ చేస్తే కొందరేమో పార్టనర్ తో సగం పని కానిస్తున్నారట. దీనికి దూరంగా ఉండడం ప్రాణానికి మంచిది. ఇక పార్కింగ్ లాట్లలో.. నిర్మానుష్య ప్రదేశాల్లో కార్లను ఆపి.. కారు లోపల.. కారు బైట సెక్సులో పాల్గొంటున్నారట. ట్రబుల్ ఏంటంటే అన్ని చోట్ల ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి. పైగా పైన దేవదేవుడు లాగా గూగుల్ శాటిలైట్ సర్వైలెన్స్ ఉంటుంది. మీ రచ్చ హై డెఫినిషన్ లో రికార్డు అవుతుంది. అందుకనే ఇలాంటి కక్కుర్తి పనులు మానుకోవాలట.

2. కొరకడం..గిల్లడం.. జుట్టు పీకడం: ప్రేమగానో కామంగానో పంటిగాటు పెట్టడం వరకూ ఓకే కానీ డ్రాకులా లాగా రక్తదాహం తీర్చుకోవాలని ప్రయత్నిస్తే మీ పార్టనర్ మీకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయట. ప్రేమగా శిరోజాలను పట్టుకోవడం..లాగడం ఒకే కానీ బ్రతుకు జట్కా బండి కపుల్స్ తరహాలో జుట్టు పీకితే కూడా భాగస్వామి దూరమయ్యే ఛాన్స్ ఉందట. గిల్లడం కూడా అంతే.. పెన్సిల్ లాక్కున్నారనే చిన్నప్పటి కోపం ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేనే లేదు.

3. చాలామందికి అందరి విషయాల్లో.. తమకు సంబంధం లేని వ్యవహారాల్లో వేళ్ళు పెట్టి కెలికి కంపు చేసే అలవాటు ఉంటుంది. ఆ ధోరణి సెక్సులో ఉండడం మంచిది కాదట. వేళ్ళను జాగ్రత్తగా వాడాలట. ఇంతకంటే దీన్ని వివరించడం కష్టం!

4. ఈమధ్య కొంతమంది పోర్న్ వీడియోలు చూస్తూ.. ఆ తరహాలో చేయాలని పార్టనర్ ను ఇబ్బందులు పెడుతున్నారట. కొన్ని సార్లు వయోలెంట్ సెక్స్ కావాలని కూడా బలవంతం చేస్తున్నారట. సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్.. బ్యాట్ మ్యాన్ సినిమాలు చూడడానికి.. జస్ట్ చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే. వాటిలో కొన్ని ఫీట్లు మనం చేస్తే పైలోకాలకు తత్కాల్ టికెట్ కన్ఫాం అవుతుంది. ఈ పోర్న్ వీడియోలు కూడా అలాంటివే. జస్ట్ చూడడానికే అనే కనీస జ్ఞానం.. కామన్ సెన్స్ మనకు ఉండాలి.

5. అదేదో సినిమాలో ‘నాకి చంపేస్తా’ అన్నట్టు మన నాలుకతో అవతలి మనిషిని చంపకూడదట. నాలుకను జాగ్రత్తగా వాడాలట. భాగస్వామిపైన నాలుక దాడి చేయడం. లాలాజల స్నానం చేయించడం వల్ల రోతపుడుతుందని కొందరు సమరం లాంటి పేరెన్నికగన్న విద్వాంసులు చెప్తారు.

ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే భాగస్వామి కూడా ఒక మనిషి అని గుర్తుంచుకోవాలి. పార్టనర్ ఓ మిషన్ కాదని.. రోబో అంతకన్నా కాదని.. వారికి ఫీలింగ్స్ ఉంటాయని మనసులో ఉంచుకోవాలి. అయితే మరో విషయం ఏంటంటే పైన చర్చించుకున్న అంశాలు అన్నీ మీ పార్టనర్ కు… మీకు మహా ఇష్టం అనుకోండి.. మీరు ఇక రెచ్చిపోవచ్చు. అలా జరిగితే మీది దేవుడు ప్రత్యేకంగా సమయం వెచ్చించి మరీ డిజైన్ చేసిన నంబర్ 1 జోడీ అన్నమాట!
Please Read Disclaimer