Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> కరోనా వేళ.. జలుబుకు ఇలా చెక్ చెప్పండి

కరోనా వేళ.. జలుబుకు ఇలా చెక్ చెప్పండి


వానాకాలం వచ్చేస్తోంది. దానికితోడు కరోనా చుట్టుముట్టేసింది. సీజన్ మారడంతో జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లు ఈకాలంలో ఇబ్బంది పెడతాయి. అది కరోనా రోగమా? లేక సాధారణ జలుబా అని తెలియక జనాలు ఆగమాగం అవుతున్నారు. రోగనిరోధన వ్యవస్త ఏమాత్రం బలహీనంగా ఉన్నా తేలిగ్గా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకే జలుబు నుంచి వంటింటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు..

ఇంట్లోనే వీటితో జలుబును నివారించవచ్చు. అల్లం దాల్చిన చెక్క అనాసపువ్వు తేనే ఆపిల్ సీడర్ వెనిగర్ నిమ్మకాలతో పాటు కొద్దిగా నీరు తీసుకోవాలి. అల్లం నాలుగుకప్పులో నీటిలో వేసి మరిగించాలి. అందులో దాల్చిన చెక్క అనాస పువ్వులను వేయాలి. పది నిమిషాలపాటు మరిగిన మిశ్రమాన్ని బాగా కలిపి దానికి రెండు టేబుల్ స్పూన్ల తేనె రెండు టేబుల్ స్పూన్ల అపిల్ సీడర్ వెనిగర్ కలపాలి. ఒక నిమ్మ చెక్కను పిండి రసాన్ని కూడా యాడ్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఈ డ్రింక్ జలుబు ఫ్లూ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం దాల్చిన చెక్క రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తేనే అనాసపువ్వులో యాంటి బ్యాక్టీరియల్ గుణాలు ఉండడంతో జలుబు తగ్గిపోతోంది.

ఇక ఇంట్లోనే వేరే పదార్థాలతో కూడా జలుబును నివారించవచ్చు. వాము లేదా ఓమ.. పేరేదైనా కేవలం వంటల్లోనే కాదు అనారోగ్యాలను తరిమి కొట్టడంలోనూ వాము ఉపయోగపడుతుంది. వాము వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి సువాసన వస్తుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది.

వామును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా నలపాలి. అనంతరం ఆ పొడిని శుభ్రమైన వస్త్రంలో కట్టి దాన్ని వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే జలుబు వెంటనే తగ్గుతుంది.

ఈ సమస్యకు ఆవిరిపట్టడం కూడా ఉపశమనం ఇస్తుంది. ఇన్ హెలర్ల వాడకం ఎంతమాత్రం మంచిది కాదు.. ఇక యాంటిబయటిక్స్ వాడితే మీ లివర్ కు ఎఫెక్ట్.. దీంతో వాముపొడితో వాసన పీలిస్తే ఎంతో బెటర్..