వామ్మో.. ఈ గొర్రె ఖరీదు రూ.3.50కోట్లు

0

మన ఏరియాల్లో ఒక్కో గొర్రెను 5 వేల నుంచి రూ.10వేల వరకు కొన్ని దాన్ని ఖైమా కొట్టి మటన్ చేసుకుంటాం. కిలో రూ.600 అంటేనే అబ్బో అంటాం. ఈ గొర్రెకు భారీ ధర పలకడం నిజంగా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. స్కాట్ లాండ్ దేశంలో మేలు జాతి గొర్రెకు ఏకంగా రూ.3.50 కోట్లు పలకడం అందరినీ ఆశ్చర్చపరిచింది.

నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.. స్కాట్ లాండ్ దేశంలోని లనార్క్ లో గురువారం జరిగిన వేలంలో టెక్సెల్ జాతికి చెందిన డబుల్ డైమండ్ అనే పేరు గల గొర్రె (లాంబ్) రికార్డ్ స్థాయి ధర పలికింది.

యూకేలో వీటి మాంసం ఎక్కువగా సంతతి పెంచేందుకు.. వీర్యం ఉత్పత్తికి(బ్రీడింగ్) వినియోగిస్తారు. ఈ మేలుజాతి గొర్రె మాంసానికి భారీ డిమాండ్ .వీటి ఉన్నికి మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ మగజాతి టెక్సెల్ జాతి గొర్రెలను భారీ ధరకు కొంటుంటారు.

ఎంత ఖరీదైనా సరే ఈ గొర్రెలను కొనడానికి యూరప్ లో ఎగబడుతుంటారు. టెక్సెల్ లో వీటి కోసం తెగ పోటీ ఉంటుంది.