Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 8th June 2014

Srikaram Subhakaram 8th June 2014


Srikaram Subhakaram 8th June 2014

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (2014-06-08  –  2014-06-14)

మేషం….
——-
ఆర్థికంగా కొంత అనుకూలమే.
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.
ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.
వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు.
సంఘంలో మీకంటూ ప్రత్యేకతను చాటుకుంటారు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
జీవితాశయం నెరవేరుతుంది.
చిరకాల కోరిక నెర వేరుతుంది.
వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.
పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహమే.
కళాకారులు అవకాశాలపై సంతృప్తి చెందుతారు.
మహిళలకు ఈతిబాధలు తొలగుతాయి.
సోమ, మంగళవారాలలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం.
ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం…
——-
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి.
బంధువర్గంతో తగాదాలు.
దూరప్రయాణాలు ఉంటాయి.
కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.
మానసిక ఆందోళన చెందుతారు.
విలువైన వస్తువులు భద్రంగా ఉంచుకోండి.
ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు తప్పవు.
వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు.
ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.
పారిశ్రామికరంగం వారికి చికాకులు తప్పవు.
కళాకారులకు అంచనాలు తప్పుతాయి.
మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది.
బుధ, గురువారాలలో ఆకస్మిక ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. భార్యాభర్తల మధ్య సఖ్యత.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం..
——
కొత్త ఆశలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.
పరపతి పెరుగుతుంది.
సన్నిహితుల సాయం అందుతుంది.
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
వాహనాలు, స్థలాలు కొంటారు.
విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.
కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం.
శుభకార్యాలు నిర్వహిస్తారు.
వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.
రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.
కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.
మహిళలకు ఆస్తిలాభ సూచనలు.
సోమ, మంగళవారాలలో దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలోచికాకులు.
తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం.
వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కర్కాటకం…
——–
కొత్త కార్యక్రమాలు చేపడతారు.
బంధువుల నుంచి శుభవార్తలు.
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ఇంటాబయటా అనుకూలం.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.
విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం.
శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు.
స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు.
వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
రాజకీయవర్గాలకు పదవీయోగం.
కళాకారులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.
మహిళలకు కుటుంబంలో ప్రత్యేక గౌరవం.
బుధ, గురువారాలలో అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం.
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
శివాష్టకం పఠించండి.

సింహం…
——-
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి.
కాంట్రాక్టులు పొందుతారు.
ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది.
భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.
వాహనయోగం.
పలుకుబడి పెరుగుతుంది.
వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు.
పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళాకారులు అవార్డులు స్వీకరిస్తారు.
మహిళలకు ఆస్తిలాభం.
సోమ, మంగళవారాలలో ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మనశ్శాంతిలోపం.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆంజనేయ దండకం పఠించండి.

కన్య…
—–
ఈవారం ఆశ్చర్యకరమైన రీతిలో పనులు పూర్తి కాగలవు.
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.
బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.
ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది.
చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు.
అరుదైన ఆహ్వానాలు రాగలవు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు.
చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.
వ్యాపారాలలో ముందుకు సాగి లాభాలు అందుకుంటారు.
ఉద్యోగులకు కొత్త హోదాలు తథ్యం.
పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు.
కళాకారులకు సన్మానయోగం.
మహిళలకు కొన్ని సమస్యలు తీరతాయి.
బుధ, గురువారాలలో చికాకులు. బంధువిరోధాలు. విలువైన పత్రాలు చేజారవచ్చు.
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.
అంగారకస్తోత్రం పఠించండి.

తుల….
—–
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.
ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సన్నిహితుల సాయంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.
అంచనాలు నిజం చేసుకుంటారు.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.
ఉత్సాహవంతంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. లాభాలు తథ్యం.
ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు తథ్యం.
కళాకారులు తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు.
మహిళలకు శుభవర్తమానాలు.
శుక్ర, శనివారాలు ధనవ్యయం. వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం.
గణపతి అర్చన చేయించుకుంటే మంచిది.

వృశ్చికం…
——
ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగినా ఏదో విధంగా సర్దుబాటు కాగలదు.
ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.
సన్నిహితులు పూర్తిగా సహకరిస్తారు.
ఇంటాబయటా శుభవార్తలు.
విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.
చిరకాల మిత్రులను కలుసుకుంటారు.
ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకుంటారు.
ప్రముఖులతో పరిచయాలు.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.
రాజకీయవర్గాలకు పదవీయోగం.
కళాకారులకు సంతోషకరమైన సమాచారం.
మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సోమ, మంగళవారాలలో ధననష్టం. కుటుంబసభ్యులతోతగాదాలు. ఆరోగ్యసమస్యలు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు..
—–
ఆదాయం కొంత తగ్గే సూచనలు.
బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.
సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
ఆలయాలు సందర్శిస్తారు.
ప్రముఖుల నుంచి కీలక సందేశం.
ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది.
ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం.
వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నూతనోత్సాహం.
కళాకారులకు కొత్త అవకాశాలు.
మహిళలకు కుటుంబంలోగౌరవం.
బుధ, గురువారాలలో ధనవ్యయం. సోదరులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గామాతకు కుంకుమార్చన మంచిది.

మకరం…
——-
పనుల్లో విజయం.
ఆప్తులు సహాయపడతారు.
కుటుంబసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.
భూములు, వాహనాలు, ఆభరణాలు కొంటారు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.
ఇంతకాలం వేధించిన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
కార్యశూరులై ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు.
ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ఉంటాయి.
వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాలు అందుకుంటారు.
ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం.
పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.
కళాకారులకు ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.
మహిళలకు మానసిక ప్రశాంతత.
శుక్ర, శనివారాలలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనుల్లో జాప్యం. రుణయత్నాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

కుంభం…
——
కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.
అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు.
అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు.
ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు.
ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు.
భూములు, వాహనాలు కొంటారు.
కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
మొండిబాకీలు సైతం వసూలవుతాయి.
ఆలయాలు సందర్శిస్తారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సన్నిహితులతోవివాదాలు తీరతాయి.
వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆశించిన విధంగా లాభాలు.
ఉద్యోగులకు అనుకోని హోదాలు.
రాజకీయవర్గాలకు సన్మానాలు, పదవీయోగాలు.
కళాకారులకు నూతనోత్సాహం. అవకాశాలు దగ్గరకు రాగలవు.
మహిళలకు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది.
ఆదివారం ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి.
దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.
దుర్గామాతను పూజించండి.

మీనం…
——
పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు.
ఆస్తి వ్యవహారాలలో సోదరులతో స్వల్ప వివాదాలు .
ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పవు.
దూరపు బంధువుల నుంచి అందిన సమాచారంతో కొంత ఊరట పొందుతారు.
నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వాహనాల విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం.
వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి.
ఉద్యోగవర్గాలకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉండవచ్చు.
రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.
కళాకారులు శ్రమానంతరం కొత్త అవకాశాలు అందుకుంటారు.
మహిళలకు కుటుంబసభ్యుల నుంచి సహాయం అందుతుంది.
సోమ,మంగళవారాలలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Tags: Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 8th June 2014,