త్వరగా వృద్దాప్య లక్షణాలకు గురయ్యే శరీర భాగాలు మరియు కారణాలు

0

వయసు మీరుతున్న కొలది చర్మంపై ముడతలు మరియు బలహీనంగా మారటం వంటి లక్షణాలు సాధారణమే. అయితే ఈ లక్షణాలు కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి.

మన శరీర భాగాలన్ని ఒకే రేటులో వృద్దాప్య మార్పులకు గురి కావు. ఇది వినటానికి నమ్మశక్యంగా లేకున్నను, ఇదే నిజం. అవును అన్ని శరీర భాగాలు వివిధ స్థాయిలలో వృద్దాప్య లక్షణాలకు గురవుతుంటాయి. ముఖ: కేంద్ర భాగం, చెంపలు మరియు పెదాలు మొదటగా వృద్దాప్య మార్పులకి గురవుతాయి. మిగిలిన భాగాలు వాటికి అనుగుణంగా వృద్దాప్య మార్పులకు లోనవుతూ ఉంటాయి.

చేతులు
శరీర భాగాలలో చేతులు ఎక్కువగా వాతావరణానికి బహిర్గతం అవుతాయి. ఇతర భాగాలతో పోలిస్తే, సాధారణంగా ఇవే వేగంగా వృద్దాప్య లక్షణాలకు బహిర్గతమవుతాయి. సూర్యకాంతి చేతి చర్మాన్ని ప్రమాదానికి గురి చేయటం వలన త్వరగా వృద్దాప్య లక్షణాల భారినపడతాయి. కొంత మందిలో 20 సంవత్సరాల వయసులో చేతి భాగం వృద్దాప్యానికి గురైతే, ఎక్కువ శాతం వరకి 30, 40 సంవత్సరాల వయసులో వృద్దాప్య లక్షణాలకు గురవుతాయి.

రొమ్ము ప్రాంతం
మహిళలలో రొమ్ము ప్రాంతంలో హార్మోన్లు ప్రవహించటం వలన ఈ హార్మోన్ల అసమతుల్యతల కారణంగా స్తన కనాజాలాలు త్వరగా వృద్దాప్యభారిన పడతాయి. స్త్రీలు వారి ఉన్న వయసు కన్నా, వారి స్తన భాగం రెండు లేదా మూడు సంవత్సరాల వయసు అధికంగా కనపడుతుందని అధ్యయనాలలో తెలుపబడింది. ఈ కారణం చేతనే మహిళలు రొమ్ము కేన్సర్ కు ఎక్కువగా గురవుతున్నారు.

ముఖం మరియు కళ్ళు
వయసు మీరుతున్న కొలది, చర్మంపై నల్లటి వలయాలు లేదా మచ్చలు అధికం అవుతుంటాయి. ఎక్కువగా పిగ్మెంటేషన్ వయసు మీరటానికి కారణంగా చెప్పవచ్చు. చర్మంలో కొల్లాజన్ మరియు ఎలాస్టిన్ స్థాయిలు తగ్గటం వలన వయసు మీరిన లక్షణాలు (వలయాలు) బహిర్గతం అవుతాయి. అదేవిధంగా, కనురెప్పలు సాగటం మరియు వాటి చుట్టూ ఉండే కండరాలు బలహీనపడతాయి.

మెడ
మెడ ప్రాంతంలో ఉండే చర్మం పలుచగా ఉండటం వలన మీరున్న వయసు కన్నా ఈ ప్రాంతం ఎక్కువగా కనపడేలా మారిపోతుంది. మెడ ప్రాంతంలో ఉండే చర్మం రోజు మొత్తం సూర్యకాంతికి బహిర్గతం అవటం మరియు విటమిన్ ల క్షీణతలు దీనికి కారణం అని చెప్పవచ్చు. ఈ క్షీణత కారణంగా, కొల్లాజన్ స్థాయిలు కూడా తగ్గటం వలన మెడ చర్మం చాలా బలహీనంగా కనపడుతుంది.

మోచేతులు
మోచేతులపై ఉండే వదులైన చర్మం మరొక వృద్దాప్య బహిర్గత లక్షణంగా పేర్కొనవచ్చు. సూర్యకాంతికి బహిర్గతం అవటం, ఒత్తిడి, పొగ తాగటం, సరైన స్థాయిలో ద్రావణాలను తీసుకోకపోవటం, చెమట కోల్పోవటం మరియు ఈ ప్రాంతంలో ఉండే తైలగ్రంధులు క్రియా శీలకంగా మారటం వలన ఈ ప్రాంతంలో వృద్దాప్య లక్షణాలు వేగంగా బహిర్గతం అవుతాయి.

జుట్టు:వయసు 40 సంవత్సరాలకు చేరగానే వెంట్రుకలు పలుచగా, తెల్లగా, పొడిగా మరియు పోలుసులుగా మారతాయి. గాడతలు ఎక్కువగా గల ఉత్పత్తులు మరియు చికిత్సల వలన ఈ ప్రక్రియ త్వరగా జరుగుతుంది.