పాదాలలో కలిగే తిమ్మిరులను తగ్గించే మార్గాలు

0

కాళ్ళలో తిమ్మిరులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? వీటిని తగ్గించే శక్తివంతమైన ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
1:తిమ్మురులు కలగటానికి గల కారణాలు
వ్యాయమాల వలన కాళ్ళలో తిమ్మిరులు కలుగుతాయని చాలా కాలం నుండి ప్రచారంలో ఉన్న ఒక అపోహ. కానీ, మితిమీరిన స్థాయిలో రన్నింగ్ లేదా వ్యాయమాల వలన పాదాలలో తిమ్మురులు తప్పక కలుగుతాయి. ఇవి మాత్రమే కాకుండా, పోషకాహర కొరత, నీటి మరియు ఎలక్ట్రోలైట్ ల అసమతుల్యతల వలన కూడా పాదాలలో తిమ్మిరులు ఏర్పడవచ్చు. కారణం ఏదైనా ఇక్కడ తెలిపిన పద్దతుల ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

2:ఎక్కువగా నీటిని తాగండి
రోజు మొత్తంలో అధికంగా నీటిని తాగటం వలన పాదాలలో కలిగే తిమ్మిరులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కండరాలు సరిగా పని చేయాలంటే శరీరాన్ని హైడ్రేటేడ్ ఉంచుకోవాలి. కావున నీటిని ఎక్కువగా తాగి ఈ సమస్యలకు దూరంగా ఉండండి.

3:మెగ్నీషియం తీసుకోండి
పాదాలలో కలిగే తిమ్మిరులకు దూరంగా ఉండాలంటే అరటిపండు, పచ్చని కూరగాలు, ఆకుకూరలు, నట్స్, సీడ్స్, చేపలు, బీన్స్, హోల్ గ్రైన్స్ అవకాడో మరియు డార్క్ చాక్లెట్ వంటి ఆహర పదార్థాలను మీరు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి.

4:రోజు పాదాలకు మసాజ్
రోజు భయటకు వెళ్ళే ముందు మరియు రాత్రి వచ్చాక పాదాలకు మసాజ్ చేయటం వలన కలిగే ప్రయోజనాలు మీరే గమనిస్తారు. రోజు ఇలా రెండు సార్లు మసాజ్ చేయటం వలన కాలి కండరాలు బలంగా మరియు సౌకర్యవంతంగా మారతాయి.

5:సరైన పాదరక్షకాలను ధరించటం
పదాలలో కలిగే ఇలాంటి తిమ్మురులను తొలగించుకోటానికి అందుబాటులో ఉన్న మార్గం- ఎత్తుగా ఉండే లేదా బిగుతుగా ఉండే షూలను దరించకుండా ఉండటం. ఎందుకంటే బిగుతుగా ఉండే షూల వలన కాలి కండరాలు బిగుతుగా చేయబడి, తిమ్మిరులు కలుగుతాయి.