విడుదల తేదీ : మార్చి 01, 2019
నటీనటులు : కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే
దర్శకత్వం : కే వి గుహన్
నిర్మాత : మహేష్ ఎస్ కోనేరు
సంగీతం : శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫర్ : కే వి గుహన్
ఎడిటర్ : తమ్మిరాజు
కే వి గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘118’. మంచి అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం ..
కథ :
గౌతమ్ (కళ్యాణ్ రామ్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తనకు ఆద్యా ( నివేత థామస్ ) గురించి కల వస్తుంది. ఆ కల కు గౌతమ్ నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటలకు కనెక్షన్ ఉంటుంది. దాంతో నిజంగా ఆమె వుందా లేదా, అసలు ఆమె ఎవరు అని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేటివ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో గౌతమ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు. ఇంతకీ ఆద్యా ఎవరు ? ఆమె ఏం చేసేది? చివరికి ఆద్యా ను గౌతమ్ కలిశాడా లేదా ? అసలు 118 కి ఆద్యా కు వున్న సంబంధం ఏంటి అనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ అంటే కాన్సెప్ట్ అనిచెప్పాలి. ఇక ఆ కాన్సెప్టు ని తెర మీదకు తీసుకురావడంలో గుహన్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అలాగే సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ ఫై ఇంట్రస్ట్ ను తీసుకొస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కళ్యాణ్ రామ్. గౌతమ్ పాత్రలో చాలా బాగా నటించాడు. కొత్త మేక్ ఓవర్ తో కళ్యాణ్ రామ్ సినిమాలో ఎనర్జిటిక్ గా కనిపించాడు. అలాగే ఆధ్యా పాత్రలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ తన నటన తో మెప్పించింది. కథ అంతా ఆమె చుట్టూ తిరిగేది కావడంతో సినిమాలో ఆమె కు మంచి పాత్ర దొరికింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది.
కళ్యాణ్ రామ్ కు సపోర్టింగ్ పాత్రల్లో నటించిన షాలిని పాండే , కమెడియన్ ప్రభాస్ శ్రీను వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యింది.అలాగే విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీనే. కాన్సెప్ట్ బాగున్నా దానికి తగ్గ కథను రెడీ చేసుకోలేకపోయాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా సెకండ్ హాఫ్ లో ఆ ఫీల్ మిస్ అవుతుంది. దానికి కారణం నివేదా థామస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ చాలా వరకు ఊహాజనితంగా సాగడం కూడా సినిమాకు మైనస్ ఆయ్యింది.
ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ కి స్క్రిప్ట్ లో డెప్త్ ఉంటే సినిమా మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో అది మిస్ అయినా ఫీల్ కలుగుతుంది. ఇక దానికి తోడు సినిమా అంతా సీరియస్ గా సాగడం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు.
సాంకేతిక విభాగం :
మంచి కాన్సెప్ట్ ను సెలక్ట్ చేసుకున్న డైరెక్టర్ కే వి గుహన్ దానికి తగ్గట్లు గా కథను సిద్ధం చేసుకోలేకపోయాడు. కానీ సినిమా ను ఇంట్రస్టింగ్ గా చూపించడం లో చాలా వరకు విజయం సాధించారు. ఇక మిగతా టెక్నీషియన్స్ విషయానికి వస్తే శేఖర్ చంద్ర సంగీతం తో పర్వాలేదనిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం ఆకట్టుకున్నాడు. ఆయన నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది.
అలాగే ఈసినిమాకు డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రఫర్ అయినా గుహన్ కెమెరామెన్ గా కూడా మెప్పించాడు. సినిమాలోని ప్రతి ఫ్రెమ్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. మహేష్ కోనేరు నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి.
తీర్పు :
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో గుహన్ తెరకెక్కించిన ఈ 118లో కాన్సెప్ట్ , కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ ల నటన హైలైట్ అవ్వగా సెకండ్ హాఫ్ లో వచ్చే నివేదా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మైనస్ గా చెప్పొచ్చు. చివరగా ఈ చిత్రం ఏ సెంటర్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అయితే బి & సి సెంటర్ల ప్రేక్షకులు ఈసినిమా ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
-
సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
Date & Time : 08:37 AM March 01, 2019 -
సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దిశకు చేరుకుంటుంది.కళ్యాణ్ నివేతా విషయంలో వచ్చిన కలకు సంబందించిన మిస్టరీని చేధించే దిశగా సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:21 AM March 01, 2019 -
తెరపైకి నాజర్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు ల్యూసిడ్ డ్రీమ్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయి.
Date & Time : 08:19 AM March 01, 2019 -
ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది.ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఆ క్రైమ్ కి ఎదురు నిల్చున్నాడు.
Date & Time : 08:16 AM March 01, 2019 -
నివేతా ఒక ఫార్మా మెడికల్ వారు చేస్తున్న క్రైమ్ ని ఛేదిస్తుంది.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 08:12 AM March 01, 2019 -
ఇప్పుడు నివేతా ఫ్లాష్ బ్యాక్ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:02 AM March 01, 2019 -
ఆధ్యా స్నేహితురాలు ఈస్తర్ వెనుకున్న సస్పెన్స్ కూడా ఇప్పుడు వీడింది ఈ సందర్భంలోనే ఒక ఫైట్ కూడా స్టార్టయ్యింది.
Date & Time : 07:58 AM March 01, 2019 -
కళ్యాణ్ రామ్ తనకి వచ్చిన కల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నారు.విలన్ గ్యాంగ్ కు సన్నిహితుడుగా రాజీవ్ కనకాల ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 07:55 AM March 01, 2019 -
గౌతమ్ ఆధ్యా ఎవరో కనుక్కోడానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు.ఈ సమయంలోనే అతనికి కొన్ని ఇంట్రస్టింగ్ క్లూ లు దొరుకుతున్నాయి.
Date & Time : 07:45 AM March 01, 2019 -
ఇంటర్వెల్ అనంతరం హీరో మరియు విలన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:40 AM March 01, 2019 -
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : మొదటి సగానికి వచ్చేసరికి చక్కని కథనంతో సినిమా డీసెంట్ గా సాగిపోయింది.సినిమాలో కాన్సెప్ట్ మరియు ఇంటర్వెల్ బ్లాక్ లో ట్విస్ట్ కూడా బాగున్నాయి.ఇప్పుడు సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Date & Time : 07:37 AM March 01, 2019 -
ఒక చిన్న ట్విస్ట్ ఇప్పుడే చోటు చేసుకొని సినిమా సగానికి పూర్తయ్యింది.ఇప్పుడు విరామం.
Date & Time : 07:33 AM March 01, 2019 -
కళ్యాణ్ రామ్ మొత్తానికి తన కలలో కనిపించిన నివేతా ను ఆధ్యా అనే అమ్మాయిగా కనుక్కున్నాడు.ఇప్పుడు కల్యాణ్, షాలిని మరియు ప్రభాస్ శ్రీనులతో కలిసి ఆమె మిస్సవ్వడానికి గల కారణాలను ఆమె తండ్రి నుంచి కనుక్కోడానికి కలిసిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:21 AM March 01, 2019 -
ఒక మిస్సయిన అమ్మాయి పాత్రలో హరితేజ(ఈస్తర్) గా పరిచయం అయ్యింది.రామ్ ఈమెకు తనకి వచ్చిన కలకి ఏమన్నా సంబంధం ఉందా అని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 07:14 AM March 01, 2019 -
కళ్యాణ్ రామ్ అసలు నివేతా ఎవరో కనుక్కోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆ సంబంధిత ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 07:09 AM March 01, 2019 -
కళ్యాణ్ రామ్ కలలకు సంబందించి స్పెషలిస్ట్ డాక్టర్ అయిన నాజర్ ను కలిసాడు.ఇప్పుడు కళ్యాణ్ రామ్ గర్ల్ ఫ్రెండ్ గా షాలిని పాండే పరిచయం అయ్యింది.ఇప్పుడు వీరిద్దరి మధ్య చందమామే పాట వస్తుంది.
Date & Time : 07:01 AM March 01, 2019 -
కళ్యాణ్ రామ్(గౌతమ్) కలలో అనుమానాస్పదంగా ఒక అమ్మాయి చనిపోయింది.ఆ అమ్మాయి పాత్రలో నివేతా థామస్ పరిచయం కాబడింది.
Date & Time : 06:53 AM March 01, 2019 -
118 టైటిల్ వెనుకున్న సస్పెన్స్ ఏంటో రివీల్ చేసే సీన్ తోనే సినిమా మొదలయ్యింది.ఒక జర్నలిస్ట్ గా హీరో కళ్యాణ్ రామ్ పరిచయం అయ్యారు.ఇప్పుడు ఒక పోరాట సన్నివేశం వస్తుంది.
Date & Time : 06:48 AM March 01, 2019 -
సినిమా తారక్ ధన్యవాదాలు తెలిపే వాయిస్ ఓవర్ తో ఇప్పుడే మొదలయ్యింది.తారక్ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని సూచించే మాటలు వస్తున్నాయి..
Date & Time : 06:40 AM March 01, 2019 -
హాయ్..126 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 06:37 AM March 01, 2019
118 రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 3.5
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 3.75
దర్శకత్వ ప్రతిభ - 3.75
3.7
118 రివ్యూ
118 రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

