విడుదల తేదీ : సెప్టెంబరు 13, 2019
నటీనటులు : నాని,కార్తికేయ, ప్రియాంకా అరుళ్ మోహన్,లక్ష్మీ, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్
దర్శకత్వం : విక్రమ్ కుమార్
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, ఎర్నేని రవి మరియు మోహన్ చెరుకూరి
సంగీతం : అనిరుధ్ రవి చంద్రన్
సినిమాటోగ్రఫర్ : మీరోసలా క్యూబా బ్రోజెక్
ఎడిటర్ : నవీన్ నూలి
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మించిన విభిన్న చిత్రం ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
పెన్సిల్ పార్ధ సారథి (నాని) సినిమాలు చూసి క్రైమ్ నవల్స్ రాస్తూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో అతని దగ్గరకి ఓ ఐదుగురు ఆడవాళ్లు ఓ వ్యక్తిని చంపాలని.. దానికి సాయం చేయాలని కోరతారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆ ఆడవాళ్ల గ్యాంగ్ లీడర్ గా నాని మారతాడు. ఈ గ్యాంగ్ అంతా కలిసి ఆ వ్యక్తి కోసం వెతికే క్రమంలో.. తాము చంపాలని తిరుగుతున్న వ్యక్తే దేవ్ (కార్తికేయ) అని తెలుసుకుంటారు. దాంతో దేవ్ ని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంతలో నాని ఆ గ్యాంగ్ లోని ప్రియా (ప్రియాంక అరుల్ మోహన్)తో ప్రేమలో పడతాడు. అసలు వీళ్ళు దేవ్ ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? దేవ్ కి వీళ్ళకి సంబంధం ఏమిటి ? చివరికి దేవ్ ని చంపారా? లేదా? ఇంతకీ నాని ఆ ఆడవాళ్లకి ఎందుకు సాయం చేస్తున్నాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
పర్ఫెక్ట్ హిట్ కోసం నాని ఎంచుకున్న ఈ ‘గ్యాంగ్ లీడర్’ రివేంజ్ కామెడీ డ్రామాగా సాగుతూ ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా సినిమాలో లక్ష్మీ, శరణ్య, ప్రియాంక తదితరులతో కూడిన గ్యాంగ్ తో నాని చేసిన సీన్స్ చాలా ఎంటర్‌టైనింగ్ గా సాగుతాయి. అలాగే క్లైమాక్స్ లో నాని, కార్తికేయతో చేసిన యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఇక మ్యూజిక్ సంచలనం అనిరుధ్ ఈ సినిమాకి అందించిన సంగీతం మరియు హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ అలాగే ఓపెనింగ్ యాక్షన్ సన్నివేశంబాగా ఆకట్టుకుంటాయి.
పెన్సల్ పార్ధ సారథి అనే పాత్రలో నాని తన పాత్రకు తగ్గట్లు… తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని అలాగే కొన్ని కామెడీ సన్నివేశాల్లో తన కామెడీ టైమింగ్ తో నాని అద్భుతంగా నటించాడు.
ఇక హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ కొన్ని లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే రేసర్ గా కనిపించిన కార్తికేయ కూడా బాగా నటించాడు. లక్ష్మీ, శరణ్య.. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు మరియు వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా.. ఆ తరువాత కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్ లోని ఆ కొన్ని ల్యాగ్ సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా వచ్చి ఉండేది.
అయితే దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని కీలక సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ అక్కడక్కడ బోర్ కొడుతోంది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లవ్ సీన్స్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. ప్రేమ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.
తీర్పు :
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ కామెడీ రివేంజ్ డ్రామా సరదాగా మంచి ఫన్ తో సాగుతూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుటుంది. అయితే దర్శకుడు సినిమాను ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను నెమ్మదిగా నడిపారు. మొయిన్ గా సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ స్ కి ముందే సీన్స్ స్లోగా సాగుతాయి. ఐతే నాని తన కామెడీ టైమింగ్ తో సినిమాలో బాగా అలరించారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.
-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
Date & Time : 06:05 AM September 13, 2019 -
ఇప్పుడు మరొక ట్విస్ట్ చోటు చేసుకోవడంతో సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ కు చేరుకుంది.
Date & Time : 05:45 AM September 13, 2019 -
ఇప్పుడు కుర్చీ అంచున కూర్చొనే రేంజ్ థ్రిల్లింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:35 AM September 13, 2019 -
ఇప్పుడు ఒక ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 05:25 AM September 13, 2019 -
ఇప్పుడు కార్తికేయ మరియు గ్యాంగ్ మధ్య కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:15 AM September 13, 2019 -
ఇప్పుడు గ్యాంగ్ కార్తికేయను ఫాలో అవుతున్నారు.ఆ డబ్బుకు సంబంధించిన అసలు రహస్యం ఒక ట్విస్ట్ తో తెలిసిపోయింది.ఇప్పుడు అసలు ఆట మొదలయ్యింది.
Date & Time : 04:55 AM September 13, 2019 -
చిన్న పాపతోని కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.ఇప్పుడు హొయినా హొయినా పాట వస్తుంది.
Date & Time : 04:48 AM September 13, 2019 -
ఇంటర్వెల్ అనంతరం దేవ్(కార్తికేయ)కు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:45 AM September 13, 2019 -
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలతో డీసెంట్ గా కొనసాగింది.కథాంశంలో కాస్త కొత్తదనం ఉన్నట్టు అనిపిస్తుంది.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 04:40 AM September 13, 2019 -
ఇప్పుడు సినిమా సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 04:35 AM September 13, 2019 -
ఇప్పుడు కథనం మరింత ఫాస్ట్ గా మారింది.కార్తికేయ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:30 AM September 13, 2019 -
ఇప్పుడు మూడో క్లూ తెలిసింది అలాగే భారతదేశంలోనే నెంబర్ 1 కార్ రేసర్ గా కార్తికేయ(దేవ్) పాత్ర పరిచయం అయ్యింది.
Date & Time : 04:28 AM September 13, 2019 -
ఇప్పుడు నాని మరియు కిషోర్ ల మధ్య హిలేరియస్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:23 AM September 13, 2019 -
ఇప్పుడు అదే దొంగతనానికి సంబంధించిన రెండో క్లూ కూడా తెలిసింది.ఇప్పుడు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ పాత్ర ఎంటర్ అయ్యింది.
Date & Time : 04:18 AM September 13, 2019 -
ఇప్పుడు రెండో పాట నిన్ను చూసే ఆనందంలో మొదలయ్యింది.ఈ పాట విజువల్ గా చాలా బాగుంది.
Date & Time : 04:10 AM September 13, 2019 -
ఇప్పుడు ఆ గ్యాంగ్ మొదట్లో జరిగిన దొంగతనంకు సంబంధించి ఒక క్లూ కనుక్కుని ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలు పెట్టారు.
Date & Time : 04:05 AM September 13, 2019 -
నాని వారికి గ్యాంగ్ లీడర్ గా ఉండేందుకు అంగీకరించాడు.ఇప్పుడు ర ర(రోర్ ఆఫ్ ది రివెంజర్స్)పాట వస్తుంది.
Date & Time : 04:00 AM September 13, 2019 -
ఇప్పుడా గ్యాంగ్, నాని(పెన్సిల్)ను కలిసి తమకు లీడర్ గా ఉండమని అడుగుతున్నారు.ఆ లేడీ గ్యాంగ్ మరియు నానీల మధ్య ఒక ఫన్నీ ఎపిసోడ్ నడుస్తుంది.
Date & Time : 03:52 AM September 13, 2019 -
ఇప్పుడు ఆ గ్యాంగ్ తమ గ్యాంగ్ లీడర్ కోసం వెతుకుతున్నారు.ఈ క్రమంలో హీరో నాని ఒక సింపుల్ మరియు ఫన్నీగా ఇంట్రో ఇచ్చారు.
Date & Time : 03:42 AM September 13, 2019 -
ఇప్పుడు ట్రైలర్ లో చూపించిన లేడీ గ్యాంగ్(మొత్తం ఐదుగురు) పరిచయం కాబడ్డారు.
Date & Time : 03:35 AM September 13, 2019 -
ఇప్పుడు ఒక బ్యాంకులో ఓ దొంగల ముఠా దొంగతనం చేస్తున్న సన్నివేశం వస్తుంది.
Date & Time : 03:25 AM September 13, 2019 -
“2006 మరియు 2007 సమయంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా” ఇప్పుడే సినిమా మొదలయ్యింది.
Date & Time : 03:20 AM September 13, 2019 -
హాయ్..157 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 03:17 AM September 13, 2019
Nani`s 'గ్యాంగ్ లీడర్' రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 2.25
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 2.5
2.8
Nani`s 'గ్యాంగ్ లీడర్' రివ్యూ
Nani`s 'గ్యాంగ్ లీడర్' రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

