సినిమా : రణరంగంనటీనటులు : శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్
దర్శకత్వం : సుధీర్ వర్మ
నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ
సంగీతం : ప్రశాంత్ పిళ్ళై
సినిమాటోగ్రఫర్ : దివాకర్ మణి
ఎడిటర్ : నవీన్ నూలి
శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్స్ గా వచ్చిన సినిమా ‘రణరంగం’. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
దేవ (శర్వానంద్) తన ఫ్రెండ్స్ తో కలిసి వైజాగ్ లోని ఓ కాలనీలో ఉంటూ.. సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ ఉంటారు. ఈ క్రమంలో గీత (కల్యాణి ప్రియదర్శన్)ని చూసిన తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు దేవ. ఆ తరువాత ఇద్దరి మధ్య పరిచయం ఎలా అయింది.. ఆ పరిచయం కాస్త ప్రేమ నుండి పెళ్లి వరకూ ఎలా దారి తీసింది..? ఈ మధ్యలో దేవ ఎలాంటి బిజినెస్ లు చేసి.. ఎలా ఎదిగాడు..? అలాగే ప్రస్తుతం అతని జీవితంలోకి గీత (కాజల్ అగర్వాల్ ) ఎలా వచ్చింది ? చివరికి దేవని చంపటానికి ప్రయత్నం చేస్తోన్న వాళ్లు ఎవరు ? ఇంతకీ ఓ సామాన్య కుర్రాడు ఒక గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను వెండితెర పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా 1990 కాలంలో మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారంగా సాగుతూ.. సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని భావోద్వేగాలు మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. అలాగే శర్వానంద్ యాక్టింగ్ మరియు శర్వా క్యారెక్టర్ లోని షేడ్స్, శర్వానంద్ – కల్యాణి ప్రియదర్శన్ మధ్య కెమిస్ట్రీ మరియు సాంగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో ఆవేశంగా ఉండే దేవ పాత్రకు శర్వానంద్ ప్రాణం పోసాడు. ఓల్డ్ ఏజ్ పాత్రలో కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ సినిమాలోనే శర్వానంద్ హైలెట్ గా నిలిచాడు.
ఇక కథానాయకలుగా నటించిన కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ లు తమ పాత్రల్లో చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా కల్యాణి ప్రియదర్శన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ కల్యాణి ప్రియదర్శన్ పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి. ఇక కాజల్ పాత్ర గెస్ట్ రోల్ లాగే అనిపిస్తోంది.
హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన నటులు అందరూ హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్స్ లో చాల బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుంది.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు సుధీర్ వర్మ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ లాంటి యాక్షన్ సీక్వెన్స్ స్ బాగున్నా.. స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది. దానికి తోడు కొన్ని మెయిన్ సన్నివేశాలు కూడా బోర్ కొడతాయి. పైగా సీరియస్ గా ఎమోషనల్ గా సాగే కథ కావడంతో బిసి ప్రేక్షకుల ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు, సర్ ప్రైజ్‌లుపెద్దగా లేవు. ఉన్నవి కూడా ఆకట్టుకునేలా అనిపించవు.
పైగా సినిమాలో హీరో చుట్టూ సాగే డ్రామా మరియు బలహీనమైన సంఘర్షణకి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. అయితే దర్శకుడు హీరో జర్నీని బలంగా ఎలివేట్ చేసినప్పటికీ.. హీరోకి ఎదురయ్యే సమస్యలను కానీ.. హీరో పాత్రకి వచ్చే సంఘర్షణ గానీ ఆ స్థాయిలో లేవు. దీనికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి.అయితే దర్శకుడు సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది. ఎడిటర్ అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. ప్రశాంత్ పిళ్ళై పాటలు బాగున్నాయి. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథాకథనాలను రాసుకోలేకపోయారు.
తీర్పు :
శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నా..,కథాకథనాలు స్లోగా సాగుతూ సినిమా ఆసక్తికరంగా సాగలేదు.దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయాడు.అయితే సినిమాలో శర్వానంద్ యాక్టింగ్ మరియు శర్వానంద్ – కల్యాణి ప్రియదర్శన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. మొత్తం మీద ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
‘రణరంగం’ : లైవ్ అప్డేట్స్
-
సింపుల్ సన్నివేశంతో మూవీ పూర్తయింది.వేగంగా మూవీ క్లైమాక్స్ పూర్తైన భావన కలిగింది. పూర్తి రివ్యూ కొరకు చూస్తూ ఉండండి.
Date & Time : 11:16 AM August 15, 2019 -
మూవీలో మరో ఆసక్తికర మలుపు, శర్వా ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటి వెనుక అతని మిత్రులలో ఒకరు ఉన్నారని తెలుస్తుంది. మూవీ క్లైమాక్స్ వైపుగా వెళుతుంది.
Date & Time : 11:10 AM August 15, 2019 -
ఓ ఆసక్తికర మలుపు తో మూవీలోని ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరు చనిపోవడం జరిగింది. ఒక భావోద్వేగ పోరాట సన్నివేశం నడుస్తుంది.
Date & Time : 11:03 AM August 15, 2019 -
హీరో శర్వానంద్ పరారీలో ఉన్నారు, కాజల్ ని శర్వా శత్రువులు కిడ్నాప్ చేయడం జరిగింది. మూవీ కథనం రెండు భిన్న కాలాల్లో జరిగిన సంఘటనల సమాహారంగా సాగుతుంది.
Date & Time : 10:56 AM August 15, 2019 -
రొటీన్ సన్నివేశాలు పదే పదే వస్తున్న భావన కలుగుతుంది. మురళి శర్మ పాత్ర చాలా బాగుంది. మూవీ రెండవ భాగం వేగం కోల్పోయింది.
Date & Time : 10:48 AM August 15, 2019 -
మూవీ మరలా ప్రెసెంట్ లోకి వచ్చింది. శర్వానంద్ కోలుకున్నాడు. మూవీ కొంచెం నెమ్మదించింది.
Date & Time : 10:42 AM August 15, 2019 -
అనేక నాటకీయ పరిణామాల అనంతరం శర్వానంద్, కళ్యాణి ని పెళ్లి చేసుకుంటాడు.పెళ్లి కూతురిగా కళ్యాణి చక్కగా ఉంది. ఓ అందమైన పెళ్లి సాంగ్ నడుస్తుంది.
Date & Time : 10:35 AM August 15, 2019 -
శర్వా అతని మిత్రులను మోసం చేసి జైలుపాలయ్యేలా చేసిన వారిపై ప్రతీకారం కోసం వారి గ్యాంగ్ సిద్ధమయ్యారు. ఓ రైలు దోపిడీ సన్నివేశం వస్తుంది.
Date & Time : 10:27 AM August 15, 2019 -
విరామం తరువాత హీరో శర్వానంద్ గాయాల నుండి కోలుకుంటున్న సన్నివేశాలు వస్తున్నాయి. అదే సమయంలో మరో మారు అతని శత్రువులు మర్డర్ ప్లాన్ చేస్తున్నారు.
Date & Time : 10:20 AM August 15, 2019 -
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్:మొదటి సంగం డీసెంట్ గా సాగిందని చెప్పాలి. మాఫియా లీడర్ గా రెండు విభిన్న కాలాలలో శర్వానంద్ నటన బాగుంది. మెయిన్ హీరోయిన్ కాజల్ కి ఇప్పటివరకు అంత ప్రాముఖ్యత ఉన్న సన్నివేశాలేమి లేవు, ఇక మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి 90లకాలం నాటి ట్రెడిషనల్ అమ్మాయిగా చాలా అందంగా ఉంది. ఇప్పటివరకు మూవీలో చెప్పుకోదగ్గ మలుపులేవి లేనప్పటికీ పర్వాలేదన్నట్లుగా సాగింది. ఇక మూవీ రెండవ భాగం ఎలా ఉంటుందో చూడాలి మరి.
Date & Time : 10:08 AM August 15, 2019 -
ఆసక్తికర ఇంటర్వెల్ సన్నివేశం నడుస్తుంది. శర్వానంద్ ని అతని శత్రువు లు ఎటాక్ చేయడం జరిగింది. ఓ హత్యాయత్న ఘటన తరువాత మూవీ మొదటిసగం పుర్తయినది.
Date & Time : 10:05 AM August 15, 2019 -
ఊహించని ఓ చిన్న ట్విస్ట్ తరువాత, చిత్రం ఓ క్రైమ్ సీన్ తో విరామం వైపుగా సాగుతుంది.
Date & Time : 09:58 AM August 15, 2019 -
మూవీ మరలా గతంలోకి వెళ్ళింది. శర్వానంద్, కళ్యాణి ల ప్రేమతో పాటు, సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న హీరో జీవితంలో అనుకోని పెద్ద కుదుపు.
Date & Time : 09:54 AM August 15, 2019 -
కాజల్ డాక్టర్ గా పరిచయమయ్యింది. శర్వా, కాజల్ మధ్య పరిచయం ఇప్పుడే నెమ్మదిగా పెరుగుతూ పోతుంది. ఒక బాడ్ సన్నివేశం తర్వాత మరొక గుడ్ సన్నివేశం తో నడుస్తుంది. మరొక సాంగ్
Date & Time : 09:48 AM August 15, 2019 -
మూవీ ప్రస్తుత కాలానికి వచ్చింది. మరో హీరోయిన్ కాజల్ పాత్ర పరిచయమైంది
Date & Time : 09:38 AM August 15, 2019 -
కమెడియన్ మనోహర్ హాస్యం బాగుంది. మూవీ ఇంకా అసలు కథలోకి ప్రవేశించలేదు .
Date & Time : 09:25 AM August 15, 2019 -
ఐదు నిమిషాల వ్యవధిలో శర్వానంద్ అతని గ్యాంగ్ సెలెబ్రేషన్స్ నేపథ్యంలో మరో సాంగ్ నడుస్తుంది. 90లనాటి యూత్ అవతార్ లో శర్వానంద్ అలరిస్తున్నారు.
Date & Time : 09:17 AM August 15, 2019 -
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పాత్ర ఇప్పుడే పరిచయమైంది. శర్వానంద్ ఆమె ప్రేమకోసం పరితపించే కుర్రాడిగా కనిపిస్తున్నాడు. 90లనాటి ట్రెడిషనల్ అమ్మాయిలా, ఓణిలో కళ్యాణి చాలా క్యూట్ గా ఉంది. సుందరి అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 09:10 AM August 15, 2019 -
ఇక శర్వానంద్ స్పెయిన్ లోని ఓ పెద్ద గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నారు. తన గతాన్ని శర్వానంద్ వివరిస్తున్నాడు. సినిమా నేపథ్యం 1995 ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళింది.
Date & Time : 09:02 AM August 15, 2019 -
వైజాగ్ నేపథ్యంలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ సంఘటనతో చిత్రం మొదలైంది. హీరో శర్వానంద్ దేవా గా పరిచయమయ్యాడు
Date & Time : 08:56 AM August 15, 2019 -
138 నిమిషాల నిడివిగల రణరంగం చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:50 AM August 15, 2019
రణరంగం రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 3
నటీ-నటుల ప్రతిభ - 4
సాంకేతిక వర్గం పనితీరు - 3.5
దర్శకత్వ ప్రతిభ - 3.25
3.4
రణరంగం రివ్యూ
రణరంగం రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

