నటీనటులు : నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నల కిషోర్ తదితరులు.
దర్శకత్వం : చందు మొండేటి
నిర్మాతలు : నవీన్ వై. సి వి మోహన్, వై రవి శంకర్
సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జే యువరాజ్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా రాబోతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. కాగా కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
విక్రమ, ఆదిత్య్ ( నాగ చైతన్య ) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కారణంగా.. ఒక బాడీలోనే ఇద్దరు కలిసి పుడతారు. విక్రమ్ ఆదిత్యకు తన అక్క భూమిక కూతురు మహాలక్ష్మి అంటే ప్రాణం. ఆ పాపలో చనిపోయిన తన తల్లిని చూసుకుంటుంటాడు. ఈ క్రమంలో విక్రమ్, తన లవర్ చిత్ర (నిధి అగర్వాల్) మళ్ళీ ఆరు సంవత్సరాల తరువాత కలుసుకుంటారు. ఇలా అంత హ్యాపీగా జరిగిపోతున్న క్రమంలో విక్రమ్ మేనకోడలు (భూమిక కూతురు) కిడ్నాప్ కి గురి అవుతుంది. అసలు ఆ కిడ్నాప్ చేసింది ఎవరు ? అరుణ్ (మాధవన్ )కి ఆ కిడ్నాప్ కి ఏమైనా సంబంధం ఉందా ? ఒకవేళ అరుణే ఆ కిడ్నాప్ చేసి ఉంటే.. ఎందుకు చేసి ఉంటాడు ? ఇంతకీ అరుణ్ కి, విక్రమ్ ఆదిత్య కు మధ్య వైరం ఏమిటి ? అరుణ్ ఎందుకు ఇవ్వన్నీ చేస్తున్నాడు ? చివరకి విక్రమ్, అరుణ్ నుండి తన మేనకోడలని కాపాడుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో నాగ చైతన్య ఒకరిలో ఇద్దరిలా చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ బాగానే అలరిస్తుంది. అలాగే తన మేనకోడలు మహాలక్ష్మి కి, తనకి మధ్య ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చైతు నటన చాలా బాగుంది.
ఇక కథానాయకిగా నటించిన నిధి అగర్వాల్ తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కాలేజీ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది.
తెలుగు ప్రేక్షకులకు లవర్ బాయ్ గా పరిచయం ఉన్న మాధవన్.. తెలివి మరియు బలమైన పవర్ ఫుల్ విలన్ పాత్రలో తన గాంభీరమైన నటనతో మెప్పించారు. మరో కీలక పాత్రలో నటించిన భూమిక కూడా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది.
ఇక వెన్నెల కిషోర్, సత్య తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్విస్తారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, షకలేక శంకర్ మధ్య వచ్చే కామెడీ బాగా పేలింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు చందు మొండేటి వానిషింగ్ ట్విన్ సిండ్రోమ సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు.
దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు.
దర్శకుడు సినిమాలో ఎంటర్ టైన్ దృష్టి లో పెట్టుకొని అనవసరమైన మరియు కథకు అక్కర్లేని కామెడీ సన్నివేశాలు పెట్టడం కూడా సినిమా ఫ్లో ని దెబ్బ తీసింది. ముఖ్యంగా సుభద్ర పరిణయం నాటకం లాంటి కామెడీ సీక్వెన్స్ పెట్టకుండా ఉండి ఉంటే బాగుండేది.
పైగా కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, కథనం స్లోగా సాగడం, లవ్ స్టోరీ పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం, మాధవన్ అంత క్రూరమైన విలన్ గా మారడానికి, బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
సాంకేతిక విభాగం :
దర్శకుడు చందు మొండేటి మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. జే యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.
ఇక సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి అందించిన పాటలు ఆయన స్థాయికి తగ్గట్టు లేకపోయిన పర్వాలేదనిపస్తాయి. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
తీర్పు:
నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా సాగలేదు. దర్శకుడు మంచి వైవిధ్యమైన స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ కు తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. సినిమాలో ముఖ్యమైన హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా సాగవు.
పైగా కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, లవ్ స్టోరీ పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం, మాధవన్ అంత క్రూరమైన విలన్ గా మారడానికి, బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
అయితే నాగ చైతన్య తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. నిధి అగర్వాల్ నటన కూడా చాలా బాగుంది. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంటుంది. ఇక వెన్నెల కిషోర్, సత్య , షకలేక శంకర్ తమ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు. మొత్తం మీద అక్కినేని అభిమానులకు ఈ చిత్రం నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.
-
భారీ యాక్షన్ సీక్వెన్స్ తరువాత సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ వుండండి telugunow.com
Date & Time : 07:15 AM November 02, 2018 -
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతుంది. మాధవన్ గ్యాంగ్ భూమికను కూడా కిడ్నాప్ చేశారు.
Date & Time : 07:02 AM November 02, 2018 -
నిధి (చిత్ర) సహాయంతో చైతు మిస్టరీ ని సాల్వ్ చేయాలనుకుంటున్నాడు. ఇక ఈచిత్రం ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. భూమిక పెళ్ళికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:54 AM November 02, 2018 -
సినిమా మళ్ళీ సీరియస్ నోట్ లోకి వెళ్ళింది. చైతు తన మేనకోడల్ను ఎలాగైనా కనిపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఒక స్టైలిష్ ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 06:45 AM November 02, 2018 -
ప్రస్తుతం నిన్ను రోడ్డు మీద అనే రీమిక్స్ సాంగ్ వస్తుంది. ఇది ఫ్యాన్స్ మెచ్చేలా వుంది.
Date & Time : 06:38 AM November 02, 2018 -
ప్రస్తుతం సుభద్ర పరిణయం అనే కామెడీ ఎపిసోడ్ వస్తుంది.
Date & Time : 06:32 AM November 02, 2018 -
చైతు మాధవన్ ను కనిపెట్టి తన మేనకోడలను కాపాడాలని చూస్తున్నాడు. వాటికీ సంబందించిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
Date & Time : 06:26 AM November 02, 2018 -
ప్రస్తుతం చైతు , మాధవన్ కు మధ్య జరిగే ఫోన్ సంభాషణ తాలూకు సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:19 AM November 02, 2018 -
తన మేనకోడలు మిస్సింగ్ మిస్టరీ ని ఛేదించడానికి విక్రమ్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం వాటికీ సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:12 AM November 02, 2018 -
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : చిత్రం మొదటి భాగం కొన్ని లవ్ మరియు కామెడీ సన్నివేశాలతో సాగిపోయింది . మాధవన్ ఎంట్రీ ఇంటర్వెల్ బ్లాక్ బాగున్నాయి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. మరి సెకండ్ హాఫ్ ఎలా వుంటుందో చూడాలి.
Date & Time : 06:06 AM November 02, 2018 -
మాధవన్ పూర్తిగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చే టైం. సినిమా మొదటి భాగం ముగిసింది . విరామం ఇప్పుడు ..
Date & Time : 06:00 AM November 02, 2018 -
విషాదంతో కూడిన ఒక ట్విస్ట్ తరువాత ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:55 AM November 02, 2018 -
ఇప్పుడు వై నాట్ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ వస్తుంది.
Date & Time : 05:45 AM November 02, 2018 -
చిత్రం యూఎస్ఏ కు షిఫ్ట్ అయ్యింది. ఎన్ ఆర్ ఐ ప్రొడ్యూసర్ గా షకలక శంకర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:38 AM November 02, 2018 -
ఫ్లాష్ బ్యాక్ పూర్తిఅయింది. ప్రస్తుతం హీరో హీరోయిన్ల ఫై 1980, 81, 82 అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 05:30 AM November 02, 2018 -
ప్రస్తుతం చైతు కు మరొక గ్యాంగ్ కు కాలేజీ లో జరిగే యాక్షన్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:25 AM November 02, 2018 -
లీడ్ పెయిర్ మధ్య కొన్ని లవ్ సన్నివేశాల తరువాత ప్రస్తుతం టిక్ టిక్ అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 05:18 AM November 02, 2018 -
హీరోయిన్ నిధి అగర్వాల్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. ప్రస్తుతం చైతు , వెన్నెల కిశోర్ , విద్యుల్లేఖ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:10 AM November 02, 2018 -
ట్రైలర్ లో చూపించినట్లుగా మాధవన్ హాఫ్ పేస్ తో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:06 AM November 02, 2018 -
యాడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ ఆయన టీం మేట్స్ అయిన వెన్నల కిశోర్ , సత్య లమధ్య కొన్ని కామెడీ సన్నివేషాలు వస్తున్నాయి.
Date & Time : 05:02 AM November 02, 2018 -
భూమిక చావ్లా చైతు అక్కగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీకి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:58 AM November 02, 2018 -
రావు రమేష్ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ గురించి వివరిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఒకరంటే ఒకరు అనే సాంగ్ వస్తుంది. కౌసల్య , ఆనంద్ లు చైతు పేరెంట్స్ గా పరిచయం చేయబడ్డారు.
Date & Time : 04:55 AM November 02, 2018 -
బస్ ప్రమాదంతో మూవీ స్టార్ట్ అయింది. విక్రమ్ గా చైతు సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:49 AM November 02, 2018 -
బ్యాక్ గ్రౌండ్ లో భస్మాసుర స్టోరీ రన్ అవుతుండగా సవ్యసాచి టైటిల్స్ పడుతున్నాయి.
Date & Time : 04:44 AM November 02, 2018 -
హాయ్ .. 150 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది
Date & Time : 04:38 AM November 02, 2018
సవ్యసాచి రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 3
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.5
3.3
సవ్యసాచి రివ్యూ
సవ్యసాచి రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

