‘మేజర్’పై నమ్మకం ఉందన్న అడివి శేష్

అడివి శేష్ .. ఓ ప్రత్యేకమైన నటుడు. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. శేష్ ఏ పాత్ర పోషించినా తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తెరపై శేష్ కనిపించడు .. అలా కనిపించడానికి ఆయన ఇష్టపడడు. కథలో కొత్తదనం .. కథనంలో వైవిధ్యం ఉన్నప్పుడే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. లేదంటే స్క్రిప్ట్ సంతృప్తికరంగా వచ్చేవరకూ కసరత్తు చేస్తూనే ఉంటాడు. శేష్ కి కథ .. స్క్రీన్ ప్లే పై మంచి పట్టు ఉంది. అందువలన స్క్రిప్ట్ దశ నుంచి ఆయన ప్రమేయం ఉంటుంది. అందువలన పాత్రలోకి ఆయన పూర్తిగా పరకాయ ప్రవేశం చేయడం తెరపై కనిపిస్తూ ఉంటుంది.

అడివి శేష్ కి ఒక్క పూటలో సక్సెస్ దక్కలేదు .. ఒక్క రోజులో ఇంతటి గుర్తింపు రాలేదు. 2002లో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన చిన్నచిన్న పాత్రలు చేస్తూ వస్తున్నాడు. అదృష్టం కొద్దీ అప్పుడప్పుడు కొన్ని మంచి పాత్రలు పడి అతని ఉనికిని చాటిచెప్పాయి. పట్టుదలతో ఆయన వేసిన అడుగులు ఫలించి హీరో అయ్యాడు. హీరోగా ఆయన చేసిన ‘క్షణం’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆయనలో ఓ బలమైన నటుడు ఉన్నాడనే విషయాన్ని ఈ సినిమా స్పష్టం చేసింది. ఆ తరువాత వచ్చిన ‘గూఢచారి’ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. హీరోగా ఈ సినిమా శేష్ ను మరోమెట్టు పైకి ఎక్కించింది.

ఇక క్రితం ఏడాది వచ్చిన ‘ఎవరు?’ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే అద్భుతం. శేష్ తన పాత్రలో చాలా డీసెంట్ గా నటించాడు. తన పాత్రని సహజత్వానికి దగ్గరగా తీసుకెళుతూ మంచి మార్కులు కొట్టేశాడు. శేష్ సినిమాలు ప్ర్రత్యేకం అనే టాక్ ను ఈ సినిమా సక్సెస్ మరింత బలపరిచింది. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన ‘మేజర్’ సినిమా చేస్తున్నాడు. ఎంతో అంకితభావంతో శ్రమిస్తున్నాడు. ఈ సినిమాకి మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడంటే కథలో మంచి దమ్ము ఉంటుందనే విషయం అర్థమవుతూనే ఉంది. తాజా ఇంటర్వ్యూలో ‘మేజర్’ సినిమాను గురించి శేష్ ప్రస్తావించాడు.

‘మేజర్’ సినిమా .. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇంకా 40 శాతం వరకూ చిత్రీకరణ జరుపుకోవలసి ఉంది. మొదటి నుంచి కూడా దేశభక్తి అనేది మనం చేసే హడావిడిలో కాదు .. మన ఆలోచనల్లో .. ఆచరణలో ఉండాలనేది నా ఉద్దేశం. ఈ సినిమా చేయాలని నేను అనుకున్నప్పటి నుంచి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి జీవితాన్ని గురించిన విశేషాలను మరింత విపులంగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ పాత్రను చేస్తూ వెళుతున్నాను. నా ప్రయత్నం ఫలిస్తుందనే ఆశిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.

Related Images:

అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ విడుదల..!

టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మేజర్”. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ వారు సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన ‘మేజర్’ లుక్ టెస్ట్ వీడియో కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

నేడు(డిసెంబర్ 17) హీరో అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా ‘మేజర్’ ఫస్ట్ లుక్ ను మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. శేష్ కి బర్త్ డే విషెస్ తెలిపిన మహేష్.. ‘మేజర్’ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలనని ట్వీట్ చేసాడు. తెలుగు – ఇంగ్లీష్ – హిందీ భాషల్లో రిలీజ్ చేయబడిన ఈ పోస్టర్ లో అడవి శేష్ లుక్ ఆకట్టుకుంటోంది. శత్రువులకు గన్ ఎక్కుపెట్టి తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడవి శేష్ ఒదిగిపోయినట్లు అర్థం అవుతోంది. ఈ సందర్భంగా ‘మేజర్’ చిత్రాన్ని 2021 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Related Images:

‘మేజర్’ లుక్ టెస్ట్ వెనుకున్న స్టోరీని రివీల్ చేసిన అడవి శేష్..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మేజర్”. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ వారు సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ లో అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల – బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేపాయి. ఈ క్రమంలో ‘మేజర్’ సినిమా ఎలా మొదలైంది.. లుక్ టెస్ట్ ఎలా జరిగింది అనే విషయాలు వెల్లడిస్తూ అడవి శేష్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

అడవి శేష్ మాట్లాడుతూ.. ”మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తనకు 2008 నుంచి మైండ్ లో ఉన్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు సాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నాను. అక్కడ న్యూస్ ఛానల్స్ లో 27న మధ్యాహ్నం ఆయన ఫోటో వేశారు. అప్పుడు సడెన్ గా ఆయన్ని చూసి ఎవరా అనుకున్నాను. చూసిన వెంటనే మా ఇంట్లో నా అన్నయ్య లా అనిపించారు. ఆయన కళ్ళలో ఒక స్పిరిట్ ఉంది. ఆయనపై వచ్చిన ప్రతీ న్యూస్ ను కట్ చేసి పెట్టుకున్నాను. ఇంటర్వూస్ కంప్యూటర్ లో సేవ్ చేసుకుని చూసుకునే వాడిని. వాటితోనే పదేళ్లు గడిచి ఇండస్ట్రీలోకి వచ్చాను. ‘మేజర్’ లాంటి పాన్ ఇండియన్ స్టోరీ నేను చెప్పగలను అని నాకు నమ్మకం వచ్చినప్పుడు ఆయన పేరెంట్స్ ను కాంటాక్ట్ చేశాను. పదేళ్లుగా నా కొడుకు లైఫ్ ని రీసెర్చ్ చేస్తున్నారా అని వారు నమ్మలేదు. వారితో మాట్లాడిన నాలుగైదు రోజుల తర్వాత నువ్వు నా కొడుకు స్టోరీతో సినిమా చేయగలవని 10 శాతం నమ్ముతున్నాం అన్నారు. అప్పుడు ఈ సినిమా కచ్చితంగా చేయాలని మొండి పట్టు పట్టాను. మేజర్ సందీప్ గారి ఐకానిక్ ఫోటో కోసం నవ్వు ఆపుకుంటూ పాస్ పోర్ట్ ఫోటో దిగారట. ఆ కళ్ళలో ఉన్న స్పిరిట్ ఇన్నేళ్ళుగా ట్రావెల్ అయ్యేలా చేసింది. సందీప్ అమ్మగారు నన్ను చూసి సందీప్ లా ఉన్నావు అన్నారు. సందీప్ పేరెంట్స్ నుంచి అంగీకారం వచ్చిన తర్వాత గ్రాండ్ గా ఈ సినిమా తీయాలని నిర్మించుకున్నాను. మహేష్ బాబు గారు మరియు సోని పిక్చర్స్ సహకారంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం” అని చెప్పుకొచ్చాడు.

‘మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం.. ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ.. ఇవి రెండూ మేజర్ సందీప్ లక్షణాలు. ఇవి రెండూ నమ్ముకుంటే చాలు’ అని లుక్ టెస్ట్ కి వెళ్లి మేజర్ సందీప్ గా ఓ ఫోటో దిగా అంటూ పాస్ పోర్ట్ సైజు ఫోటోని రివీల్ చేశాడు. ఇందులో మేజర్ సందీప్ హాఫ్ పేస్ కి మేజర్ రోల్ చేస్తున్న శేష్ హాఫ్ పేస్ ను అతికించి ఆసక్తికరంగా చూపించారు. దీనికి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు మరింత ఇంపాక్ట్ ఇవ్వడంతో పాటు గూస్ బమ్స్ కలిగించింది. ఈ సందర్భంగా ”మేజర్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను వచ్చే డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Related Images:

‘మేజర్’ ఫస్ట్ థియేటర్స్ లో.. ఆ తర్వాత ఓటీటీలో…!

సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ ప్రొడక్షన్ హౌసెస్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘మేజర్’ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ మధ్య షూటింగులకు అనుమతులు లభించడంతో గత ఆరు నెలలుగా ఆగిపోయిన ‘మేజర్’ చిత్రీకరణ తిరిగి ప్రారంభించారని తెలుస్తోంది.

హీరో అడవి శేష్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్ర షూటింగ్ లో వారు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించారు. తనతో పాటు షూట్ లో పాల్గొనే నటీనటులు సాంకేతిక నిపుణులు మరియు ఇతర సిబ్బందికి ప్రతిరోజూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్ జరుపుతున్నట్లు చెప్తూ.. షూటింగ్ నుండి ఇంటికి వెళ్లిన తర్వాత చిత్ర యూనిట్ లో ఎవరూ కూడా బయటకు వెళ్లడం లేదని పేర్కొన్నాడు. కాగా శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ లో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘మేజర్’ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్విట్టర్ చిట్ చాట్ లో పాల్గొన్న అడవి శేష్ ‘మేజర్’ సినిమా ముందు థియేటర్స్ లో రిలీజ్ చేసి ఆ తర్వాత ఓటీటీలో విడుదల అవుతుందని స్పష్టం చేశాడు.

Related Images: