ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. సీఈసీ కీలక ప్రకటన, ఈ నెల 28న

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో వాయిదాపడ్డ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయాన్ని కోరనున్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి సంబంధించి సర్క్యులర్ జారీ అయింది. రాజకీయ పార్టీలతో సంప్రదింపుల తర్వాత ప్రభుత్వంతో చర్చించనున్నారు. ఇటు ఎన్నికలకు […]