Templates by BIGtheme NET
Home >> Telugu News >> మోడీ సర్కారు కీలన నిర్ణయం.. ఉచితంగా అందరికి టీకా

మోడీ సర్కారు కీలన నిర్ణయం.. ఉచితంగా అందరికి టీకా


ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19.. భారత దేశాన్ని వదలటం లేదు. మొదట్లో కేసుల తీవ్రత ఏ మాత్రం లేకున్నా.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత నుంచి దేశంలో వరుస పెట్టి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీంతో.. కేసుల నమోదుకు ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకపోగా.. కొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తున్నాయి.ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న ఆశ.. అంతకంతకూ పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్రం ఒక ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. సరిగ్గా రెండు నెలలు.. ఇంకాస్త కచ్ఛితంగా చెప్పాలంటే మరో 73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకివచ్చేస్తుందని చెబుతున్నారు. అక్టోబరు నెలాఖరులో కోవిషీల్డ్ పేరుతో మార్కెట్లోకి వచ్చే ఈ వ్యాక్సిన్ దేశ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉందంటున్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొత్తం ఉచితంగానే పంపిణీ చేయనున్నట్లుగా కేంద్రం చెబుతోంది.

దీనికి తగ్గట్లే వ్యాక్సిన్ తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కేంద్రం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు.. ఈ వ్యాక్సిన్ ను కొనుగోలు చేయటానికి నిధుల్ని సిద్ధం చేసింది. సీరం నుంచి కొనుగోలు చేసిన వ్యాక్సిన్ ను ప్రజలకు నేరుగా అందించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మోడో దశ ట్రయల్స్ కు అనుమతిని ఇచ్చారు.

మూడో ట్రయల్ దశలో మొదటి మోతాదును టీకాను శనివారం ఇచ్చారు. రెండో మోతాదును మాత్రం ఇరవై తొమ్మిది రోజుల తర్వాత ఇవ్వనున్నారు. అనంతరందీన్ని మార్కెట్లో విడుదల చేయనున్నారు. మార్కెట్లో కోవి షీల్డ్ పేరుతో వచ్చే ఈ వ్యాక్సిన్ కోవిడ్ బాధితులకు శ్రీరామరక్షగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. మరి.. సదరు సంస్థతో పాటు.. బాధితులు సైతం కోటి కళ్లతో ఈ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఏమైనాదేశంలో వ్యాక్సిన్ ను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.