Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఫ్రాన్స్ లో ప్రమాదకర ఇన్ ఫెక్షన్ వణుకు..

ఫ్రాన్స్ లో ప్రమాదకర ఇన్ ఫెక్షన్ వణుకు..


కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అంశాల మీద మరింత శ్రద్ధ పెరిగింది. అదే సమయంలో.. కొత్తగా వస్తున్న పలు ఇన్ఫెక్షన్లు కలవరానికి గురయ్యేలా చేస్తున్నాయి. కొన్ని దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కొన్ని వైరస్ లు.. కొత్త తరహా ఇన్ఫెక్షన్లు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఫ్రాన్స్ లో పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. కళ్లలో రక్త స్రావం జరిగే ఒక ప్రమాదకర వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే వ్యాధి ఒక రకం పురుగు ద్వారా వ్యాపిస్తోందని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ -స్పెయిన్ సరిహద్దుల్లో వెలుగు చూసిన ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ నేపథ్యంలో బ్రిటన్ తన పౌరుల్ని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఎబోలా వైరస్ మాదిరే.. ఆఫ్రికా.. పశ్చిమ ఆసియా తదితర ప్రాంతాల్లో ఈ సీసీహెచ్ఎఫ్ కనిపిస్తుందని చెబుతున్నారు.

కళ్లలో రక్త స్రావం జరిగే ఒక ప్రమాదకర వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే వ్యాధి ఒక రకం పురుగు ద్వారా వ్యాపిస్తోందని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ -స్పెయిన్ సరిహద్దుల్లో వెలుగు చూసిన ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ నేపథ్యంలో బ్రిటన్ తన పౌరుల్ని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఎబోలా వైరస్ మాదిరే.. ఆఫ్రికా.. పశ్చిమ ఆసియా తదితర ప్రాంతాల్లో ఈ సీసీహెచ్ఎఫ్ కనిపిస్తుందని చెబుతున్నారు.