కౌన్ బనేగా కరోడ్ పతిలో కోటి రూపాయల ప్రశ్న ఏంటో తెలుసా?

0

బిగ్ బి అమితాబ్ సారథ్యంలో కొనసాగుతున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్ 12 ప్రస్తుతం అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ షో ద్వారా ఎంతో మంది ప్రపంచానికి హీరోలాగా పరిచయమయ్యారు. ఎంతో మంది కష్టాలను ఈ షో తీర్చింది. సామాన్యులను సైతం సెలబ్రెటీలను చేసింది.

తాజాగా ఈ సీజన్ 12లో మొదటి సారి ఓ వ్యక్తి కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకున్నారు. ఢిల్లీకి చెందిన ఛవికుమార్ అనే మహిళ రూ.50 లక్షలు గెలుచుకొని కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేక షో నుంచి వైదొలిగారు. ఆమె తను గెలుచుకున్న రూ.50 లక్షలతోనే ఇంటికి వెళ్లారు.

అయితే అంత కష్టమైన కోటి రూపాయల ప్రశ్న ఏంటనే ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో గూగుల్ లో వెతుకుతున్నారు. అదేంటనేది ఆసక్తిగా మారింది.

‘2024లో చంద్రుడిపైకి ఒక మహిళను ఒక పురుషుడిని పంపించడానికి అమెరికా చేపట్టిన ఒక స్పేస్ ప్రోగ్రామ్ కు గ్రీకు దేవత పేరు పెట్టారు. అది ఏమిటి?’ అని అమితాబ్ బచ్చన్ కోటి రూపాయల ప్రశ్నగా వేశారు.దీనికి 4 ఆప్షన్లు కూడా ఇచ్చారు. ‘రియా నెమెసిస్ అప్రోడైట్ ఆర్టెమిస్’ అనే నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. చవికుమార్ తన లైఫ్ లైన్స్ అన్నింటిని ఉపయోగించుకుంది. అయినా సమాధానం తెలియకపోవడంతో ఆట నుంచి తప్పుకుంది.

ఆమె క్విట్ కాకుండా ఏదైనా సమాధానం చెప్పి ఉంటే రూ.3.20 లక్షలకు పడిపోయేది. కానీ సమాధానం తెలియకపోవడంతో వైదొలిగి 50 లక్షలు గెలుచుకుంది. దానికి సరైన సమాధానం ‘ఆర్టెమిస్’. కానీ రియా అని చెప్పబోయిందట ఛవికుమార్.

ఢిల్లీకి చెంది ఇంగ్లీష్ టీచర్ ఛవికుమార్. ఆమె భర్త ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్.