Templates by BIGtheme NET
Home >> Telugu News >> ‘నో షేవ్ నవంబర్’ కథ తెలుసా?

‘నో షేవ్ నవంబర్’ కథ తెలుసా?


ప్రతిసారి ఏదో ట్రెండ్ ఉంటుంది. లేకున్నా సోషల్ మీడియా వచ్చాక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగులు ఏదో ఒక దాన్ని వైరల్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఓ మంచి ప్రయత్నం కోసం తాజాగా ‘నో షేవ్ నవంబర్’ క్యాంపెయిన్ మొదలైంది. ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనివెనుక ఓ కారణం ఉంది.

అమెరికాకు చెందిన మాథ్యూ హిల్ అనే వ్యక్తి క్యాన్సర్ తో చనిపోయాడు. చాలా మంది క్యాన్సర్ తో ఇలా చనిపోవడం వారిని ఆలోచింప చేసింది. తండ్రి మృతికి మనస్తాపం చెందిన ఆయన ఎనిమిది మంది కొడుకులు కలిసి ‘నో షేవ్ నవంబర్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా నవంబర్ నెల మొత్తం వారు షేవింగ్ ట్రిమ్మింగ్ చేయించుకోకుండా ఆ మిగిలిన డబ్బును క్యాన్సర్ బాధితులకు విరాళంగా ఇస్తారు.

2009 నుంచి క్యాన్సర్ బాధితులకు భరోసానిచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రపంచదేశాల్లో క్యాన్సర్ వ్యాధిపై ఈ ఉద్యమం నడుస్తోంది.

ఈ నవంబర్ నెల మొత్తం డబ్బును క్యాన్సర్ బాధితులకు సహాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఉద్యోగులు విద్యార్థులు నో షేవ్ నవంబర్ ను ఫాలో అవుతూ ఉంటారు.

ఇక కొంతమంది గడ్డం పెంచడం వల్ల కొత్త లుక్ వస్తుందని కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. సాధారణ రోజుల్లో పెంచడం వీలు కాదని.. ఈ నవంబర్ నెలలో ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటూ పెంచుకుంటున్నామని పలువురు ఉద్యమంలో భాగస్వాములు చెబుతున్నారు.