Templates by BIGtheme NET
Home >> Telugu News >> సానియా మీర్జా ఫాంహౌస్ లో ఆవును చంపారు.. విచారణ జరపాలి: రాజాసింగ్

సానియా మీర్జా ఫాంహౌస్ లో ఆవును చంపారు.. విచారణ జరపాలి: రాజాసింగ్


టెన్నిస్ స్టార్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియా మీర్జాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండలో జరిగిన కాల్పుల ఘటనపై తాజాగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు.

దామగుండలో అడవి ఉందని.. అక్కడే సానియా మీర్జాకు ఫాంహౌస్ ఉందని.. మూడు నాలుగు రోజుల క్రితం సానియా మీర్జా ఫాంహౌస్ సెక్యూరిటీ గార్డ్ ఒక ఆవును తుపాకీతో కాల్చి చంపాడని మీడియాలో వస్తున్నాయని రాజాసింగ్ తెలిపారు. కానీ వాస్తవం ఏంటంటే.. ఆ గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం.. ఫాంహౌస్ లో సానియా మీర్జా కూడా ఉందని.. ఆమె ముందే ఈ సంఘటన జరిగిందని.. ఆ ఊరోళ్లు సానియా మీర్జానే షూట్ చేసిందని అంటున్నారని రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశాడు.

గతంలో కూడా ఇదే ఫాంహౌస్ లోకి నెమలి వేరే వేరే జంతువులు వస్తే కాల్చి చంపారని ఇన్ఫర్మేషన్ వస్తోందని.. అది బయటపడలేదని రాజాసింగ్ ఆరోపించారు. నెమలి చంపారనే దానిపై ఎఫ్ఐఆర్ అయ్యిందని చెబుతున్నారన్నారు.

తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒకటే అడుగుతున్నానని.. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అయినా సానియా మీర్జా ఒక ఆవును కాల్చి చంపారని చెబుతుంటే ఆమెపైన ఏం ఎఫ్ఐఆర్ అయ్యింది? ఏం కేసు పెట్టారు.? మామూలు కేసు పెడుతారా అని రాజాసింగ్ ప్రశ్నించారు.

ఆవు అంటే హిందూ ధర్మంలో ఒక దేవుడితో సమానమని..అట్లాంటి పవిత్రమైన గోమాతను కాల్చి చంపిన వారిపై నార్మల్ కేసు కాకుండా హత్య కేసు బుక్ చేయాలని తాను డిమాండ్ చేస్తున్నానని రాజాసింగ్ తెలిపారు. సానియా మీర్జాపైన కూడా లోకల్ పోలీసులతో కాకుండా ప్రత్యేక స్పెషల్ టీంతో విచారణ జరపాలని.. ఇందులో సానియా మీర్జా ప్రమేయం ఉందా లేదా నిగ్గుతేల్చాలని రాజాసింగ్ ప్రభుత్వాన్ని కోరారు.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. ఎప్పుడు ఎన్ని సార్లు జరిగాయనే దానిపై మొత్తం విచారణ జరపాలని ప్రజల ముందు పెట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఉమర్ కానీ.. ఆయనకు ఎంత మంది సపోర్ట్ ఉన్నారో అందరిపైనా చర్యలు తీసుకోవాలని తాను ముఖ్యమంత్రిని కోరుతున్నానని రాజాసింగ్ తెలిపారు.