షర్మిల సెల్ఫ్ డబ్బా.. నెటిజన్ల ట్రోల్స్!

0

అప్పుడే పార్టీ పెట్టిందో లేదో.. వైస్సార్ తనయ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల.. సొంత డబ్బా కొట్టుకోవడం ప్రారంభించేశారు. తనను చూసి తన పార్టీ ప్రభావం చూసి.. సీఎం కేసీఆర్ దిగివచ్చారంటూ.. పేద్ద పేద్ద డైలాగులే పేల్చిన ఆమె.. ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేయడం గమనార్హం. దీంతో నెటిజన్లు కూడా అదే రేంజ్లో రెచ్చిపోయారు. `హబ్బ.. షర్మిల సొంత డబ్బా!` అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరలోనే రాష్ట్రంలోని 50 వేల ఖాళీ పోస్టులను భర్తీ చేసి.. ఉద్యోగుల ఆశలు నెరవేరుస్తామంటూ.. ఓ నోట్ జారీ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన షర్మిల.. ఇదంతా తన క్రెడిట్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. “పార్టీ పెట్టకముందే తాము నిరుద్యోగుల కోసం దీక్ష చేయడం వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్ సారు దిగొచ్చి ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని మాట్లాడుతున్నారని“ వైఎస్ షర్మిల అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లపై ఆమె ట్విట్టర్ వేదికగా దీనిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు.

నిరుద్యోగులు చనిపోతే కాని కేసీఆర్కు కర్తవ్యం గుర్తుకు రాలేదని షర్మిల అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటే కానీ… కేసీఆర్ దొరకు ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి రాలేదన్నారు. నిరుద్యోగులు చనిపోతూ ఉంటే చావకండి అని ఒక్క మాట చెప్పని కేసీఆర్… ఈరోజు జోనల్ సిస్టమ్ వల్లే ఆలస్యమైందని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తుందన్నారు. ఈరోజు కేసీఆర్ దొర కళ్లు తెరిపించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వ్యాఖ్యానించారు.

పార్టీ పెట్టకముందే తాము నిరుద్యోగుల కోసం దీక్ష చేయడం వల్లే కేసీఆర్ సారు దిగొచ్చి ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని మాట్లాడుతున్నారన్నారు. అయితే.. షర్మిల ప్రయత్నం ఆదిలోనే బెడిసి కొట్టింది. నెటిజన్లు.. రీట్వీట్ చేస్తూ.. షర్మిలను ఏకేయడం విశేషం.