నదిలో ప్రీ వెడ్డింగ్ షూట్ : పడవ బోల్తా… కాబోయే జంట మృతి !

0

ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ మారుతోంది. పెళ్లికి ముందు ఫోటోలు వీడియోలు తీసుకోవడం బాగా ఎక్కువవుతోంది. దీని కోసం ఎంత ఖర్చుకైనా సాహసానికైనా పెళ్లి జంటలు వెనుకాడట్లేదు. బెంగుళూరు ఓ జంట నదీ తీరంలో ప్రీ వెడ్డింగ్ షూటే చేస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల చివర్లో వివాహబంధంతో ఒక్కటి కానున్న కర్ణాటక జంట చంద్రు శశికళ ప్రీ వెడ్డింగ్ ఘూట్ కు ప్లాన్ చేసింది.

అందరిలా కాకుండా కొంచెం వెరైటీ గా ప్రయత్నిద్దామని అనుకుని కావేదీ తీరానికి వెళ్లారు. తలకుడులో ఉన్న ఆ నదీ తీరం త్రివేణి సంగమం. కబిని సప్తిక నదులు అక్కడ కలుస్తాయి. అవి కావేరిలో కలిసే చోటు అరి నతి సమీపంలోనే ఉంది. ఆ నదిలోనే కొత్తజంట ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ సమయంలో వారితో పాటు ఇద్దరి కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక చిన్న బోటులో కూర్చుని.. తమకు టైటానిక్ సినిమాలో హీరో హీరోయిన్ ఫోజు కావాలని అన్నారట. దీంతో కెమెరామెన్ యాంగిల్ సెట్ చేశాడు. ఆ దంపతులిద్దరూ లియోనార్డో కేట్ విన్స్లెట్ లాగా చేతులు చాచి నించున్నారు. ఉన్నట్టుండి బోటు అటూ ఇటూ ఊగింది.

ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. వారిద్దరూ నదిలో పడిపోయారు. నది లోతు నీటి ప్రవాహానికి ఆ జంట కొట్టుకుపోయింది. కుటుంబసభ్యులు ఫోటో గ్రాఫర్లు ఎంత మొత్తుకున్నా ఫలితం శూణ్యం. వారిద్దరూ నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోతున్నారు. వారి హాహాకారాలు నదిగర్భంలో కలిసిపోయాయి. కాగా సమాచారం అందుకున్న పోలీసులు.. జాలర్లను నదిలోకి పంపి మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఆ ఇరువురు కుటంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్దిరోజుల్లో ఏకమవ్వాల్సిన ఆ జంట.. అర్థాంతరంగా చనిపోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.