Templates by BIGtheme NET
Home >> Telugu News >> సెకనులో 1500 సినిమాలు డౌన్ లోడ్.. ఎలానంటే?

సెకనులో 1500 సినిమాలు డౌన్ లోడ్.. ఎలానంటే?


మారుతున్న కాలానికి తగ్గట్లుగా. ఇంటర్నెట్ వేగంలో వస్తున్న మార్పులు తెలిసిందే.ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అత్యధిక నెట్ స్పీడ్ రికార్డును బ్రేక్ చేసేలా లండన్ లోని రాయల్ అకాడమీ బ్రేక్ చేసింది. డాక్టర్ లిడియో గాల్డినో టీం ఈ ఘటను సాధించింది. ప్రస్తుతానికి ఇది పరీక్ష దశలోనే ఉంది. కాకుంటే.. కొత్త రికార్డునుక్రియేట్ చేయటంలో మాత్రం వీరు విజయం సాధించారు. ఇప్పటివరకు 44.2 టీబీపీఎస్ వేగమే అత్యధికంగా ఉండేది. ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరు మీద ఉంది.

దీనికి నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో కూడిన ఇంటర్నెట్ ను తాజాగా పరీక్షించి చూశారు. ఈ వేగం ఎంతో తెలుసా? ఏకంగా 178 టీబీపీఎస్. అంటే.. సెకనుకు 178000 జీబీలు అన్న మాట. ప్రస్తుతానికైతే.. ప్రపంచంలో ఇదే అత్యధిక వేగంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ స్పీడ్ లో సెకనులో హెచ్ డీతో కూడిన 1500 సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.

అయితే.. ఇంత వేగాన్ని సాధించటం కోసం పరిశోధకులు సాధారణ ఫైబర్ ఆక్టిక్ కేబుల్ బదులుగా.. అధిక శ్రేణితో కూడిన యాంప్లిఫైయింగ్ టెక్నాలజీని రూపొందించారు. ఇందుకోసం 16.8టీహెచ్ జెడ్ బ్యాండ్ విడ్త్ ను ఉపయోగించారు. ఇదిలా ఉంటే.. మన దేశంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఇంర్నెట్ వేగం 2ఎంబీపీఎస్ గా ఉండటం తెలిసిందే.

ఈ వేగంతో పోల్చినప్పుడు తాజాగా జరిపిన ప్రయోగం కొన్ని వేల రెట్లు అధికంగా ఉండటాన్ని మర్చిపోకూడదు. అయితే.. ఇంత వేగవంతమైన నెట్ అంటే.. ఖర్చు కూడా భారీగా ఉంటుందన్న సందేహం అక్కర్లేదంటున్నారు. ఎందుకంటే.. ఆప్టికల్ కేబుళ్లతో పోలిస్తే..యాంప్లిఫయ్యర్లను అప్ గ్రేడ్ చేయటం పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదంటున్నారు.

ప్రస్తుతానికి ప్రయోగదశలో ఉన్న ఈ ఇంటర్నెట్ వేగం.. వాస్తవరూపం దాల్చి.. వాడుకకు అందుబాటులోకి వస్తే.. పరిణామాలు మరింత వేగంగా మారిపోవటమే కాదు.. అప్పటికి కరోనా లేకుండా.. టెక్నాలజీ పరంగా బోలెడన్ని మార్పులు చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు.