Templates by BIGtheme NET
Home >> Telugu News >> శివసేన కూలిపోయే పరిస్థితి ఉందా?

శివసేన కూలిపోయే పరిస్థితి ఉందా?


సుశాంత్ మరణం.. దానికి చుట్టుకున్న డ్రగ్స్ కేసు.. మహారాష్ట్రలో కొలువైన శివసేన సర్కార్ ను కూల్చబోతోందా? కంగనతో అనవసరంగా గొడవ పెట్టుకొని శివసేన పార్టీ మూల్యం చెల్లించుకోబోతోందా? మొండిగా వెళుతున్న శివసేనకు తగిన శాస్త్రి జరగడం ఖాయమన్న ప్రచారం ముంబై సర్కిల్స్ లో సాగుతోంది.

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మరణం కేసులో హీరోయన్ కంగనా రనౌత్ స్టేట్ మెంట్స్ కాక రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలతో మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన ఉలికి పడుతోంది. శివసేన సర్కార్ ఎందుకింతగా కలవరపడుతుందో మహారాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు. సుశాంత్ కేసులో రియాకు ఇప్పుడు శివసేనకు చెందిన పత్రికలు.. శివసేన నాయకులు సపోర్టు చేస్తున్నారు. బాలీవుడ్ పెద్ద ఎత్తున ఈ కేసులో ఇన్ వాల్వ్ కావడంతో ఇది అంతా శివసేన మెడకు చుట్టుకునే పరిస్థితి ఉందంటున్నారు.

మహారాష్ట్ర ప్రజలు డ్రగ్స్ వెనుక శివసేన కూడా ఉందేమో అని అనుమానిస్తున్నారట. ఎందుకంటే అది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన విషయం. పోలీసులు డ్రగ్స్ కు సంబంధించిన డిపార్ట్ మెంట్స్ ఈ వ్యవహారాన్ని చూసుకోవాలి. కానీ డైరెక్టుగా శివసేన ఇన్ వాల్వ్ అవుతోంది. దీంతో శివసేన ప్రభుత్వం పరువు పోతోందని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఎన్సీపీ శరద్ పవార్ కు కోపం తన్నుకొస్తోందట..

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా శరద్ పవార్ ను కలిసి కంగనా ఇల్లు ఎందుకు పడగొట్టారో వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చిందట.. రాజకీయాల్లో కురువృద్ధుడు అయిన శరద్ పవార్ దీనిపై స్పందిస్తూ ఇది సరి అయిన చర్య కాదు అని ఉద్ధవ్ ముఖం మీదే చెప్పేశాడట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని.. డ్రగ్స్ కేసులో డిపార్ట్ మెంట్స్ వాళ్లకు ప్రభుత్వం సహకరించాలని.. మహారాష్ట్ర ప్రభుత్వం తరుఫున డ్రగ్స్ కేసులో ఎవరూ ఇన్ వాల్వ్ అయినా వాళ్లను ఊపేక్షించేది లేదని ప్రజలకు వివరించాలని శరద్ పవార్ కాస్త గట్టిగానే ఉద్దవ్ కు హిత బోద చేసి సలహాలు ఇచ్చాడంట..

కానీ శివసేన ఆ విధంగా వ్యవహరించకుండా కంగనా మీద కక్షతో ఆమె అపార్ట్ మెంట్ ను పడగొట్టింది. అంటే ఇది తప్పకుండా కక్ష సాధింపు అని.. కాంగ్రెస్ ఎన్సీపీ శరద్ పవార్ త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు. శివసేన మారకపోతే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.