Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏపీ స్కూళ్ల ప్రారంభంపై జగన్ నిర్ణయం

ఏపీ స్కూళ్ల ప్రారంభంపై జగన్ నిర్ణయం


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కరోనా దెబ్బకు విద్యార్థుల చదవులన్నీ అటకెక్కాయి. స్కూళ్లు కాలేజీలు మూతపడి ఏడు నెలలు దాటింది. ఇప్పటికీ కరోనా తగ్గకపోగా పెరిగింది. దీంతో ఈ సంవత్సరం విద్యార్థుల చదువుల సంగతి ఏంటనేది తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ స్కూళ్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా నేపథ్యంలో ఏపీలో మూతపడ్డ స్కూళ్లను తెరవాలని సీఎం జగన్ నిర్ణయం ఈ మేరకు మంగళవారం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 1 3 5 7 తరగతులు ఒకరోజున 2 468 తరగతులు మరో రోజు నిర్వహిస్తామని జగన్ స్పష్టం చేశారు.

విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులు తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. మధ్యాహ్నం వరకు ఒంటి పూటే స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు.

పరిస్థితిని బట్టి డిసెంబర్ నెలలో నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపకపోతే.. ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.

మొత్తానికి నవంబర్ లో అయితే స్కూళ్లు చదువులు కొనసాగించాలని జగన్ నిర్ణయించారు. మరి ఇది సాధ్యమవుతుందా? విద్యార్థులు కరోనాను దాటి స్కూళ్లకు వస్తారా అన్నది వేచిచూడాలి.