గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ఫలితాలలో అధికార టీఆర్ఎస్ బీజేపీలు హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. ఎంఐఎం ఎప్పటిలాగే తన స్థానాలను పదిలం చేసుకోగా…కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. టీఆర్ఎస్ దాదాపుగా 60 డివిజన్లలో గెలిచే అవకాశముండగా…బీజేపీ 45 డివిజన్లు గెలుచుకునే చాన్స్ ఉంది. ఎంఐఎం 40 డివిజన్లలో గెలిచే అవకాశాలుండగా…కాంగ్రెస్ పార్టీ 2 డివిజన్లతో సరిపెట్టుకుంది. పూర్తి ఫలితాలు వెలుడాల్సి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఖరారైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ ఎన్నికల ఫలితాలు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ…. 2019 ఎన్నికల్లో పరాజయం…ఇటీవల దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి….తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం పాలవడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. కనీసం పది స్థానాలైనా దక్కించుకుందని ఆశపడ్డ కాంగ్రెస్ నేతలకు భంగపాటు ఎదురైంది. కేవలం రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం కావడంతో మరోసారి కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ కు వరుస ఓటములు ఎదురుకావడం…కాంగ్రెస్ నుంచి కొందరు కీలకమైన నేతలు బీజేపీలో చేరడం వంటి పరిణామాలతో పాటు తాజాగా కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో ఉత్తమ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను ఉత్తమ్ హైకమాండ్ కు పంపినట్టు తెలుస్తోంది. అయితే ఉత్తమ్ రాజీనామాను హైకమాండ్ ఆమోదిస్తుందా…ఒకవేళ ఆమోదిస్తే కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
