లక్ష్మీ పార్వతితో వైసీపీ ప్రభుత్వం ప్రెస్ మీట్.. అవసరమా?

0

మాజీ ప్రధాని మన్మోహన్ ప్రెస్ మీట్ చూస్తుంటే నీరసం వస్తుంది. ఆయన చెప్పింది కూడా సరిగా వినపడదు. అదే మోడీ ప్రెస్ మీట్ అంటే అందరి చెవులు నిక్కబొడుస్తాయి. మాటల తూటలతో మోడీ చెలరేగిపోతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఎప్పుడు మంచి వాగ్ధాటి గల నాయకులు మాట్లాడితే.. పంచులు పేలితే ఆ ప్రెస్ మీట్ కు ఒక అర్థం పరమార్థం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే సీఎం కేసీఆర్ వంటి ఘనాపాఠి మరొకరు లేరంటారు.

అయితే వైసీపీ మాత్రం ఇంకా పాత చింతకాయపచ్చడి నేతలతోనే కౌంటర్లు ఇప్పిస్తుంటే ఏం మజా వస్తుందని వైసీపీ యూత్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారట.. తాజాగా ఔట్ డేటెడ్ పొలిటికల్ ఫెయిల్యూర్ చంద్రబాబు సీఎం కావడానికి కారణం అయిన లక్ష్మీపార్వతితో వైసీపీ ప్రెస్ మీట్ పెట్టించింది. మోడీకి లేఖ రాసిన చంద్రబాబుపై విమర్శలు గుప్పించింది. దీనిపై వైసీపీ యూత్ సోషల్ మీడియా అంతా ఆమెను ఎక్కడ ప్రమోట్ చేయాలని తలలు పట్టుకుంటున్నారట.. లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పై పంచులు డైలాగులు పేలుస్తున్నారట.. లక్ష్మీపార్వతి డైలాగులు హరికథలా సాగిపోతుంటే సోషల్ మీడియాలో పార్టీకి ఏం ప్రమోషన్ వస్తుందని వైసీపీ యూత్ వర్గాలు వాపోతున్నాయట..

వైసీపీలోని ఫైర్ బ్రాండ్స్ అయిన రోజా విడుదల రజినీ ఇంకా కొంతమంది యూత్ ఎమ్మెల్యేలతో చంద్రబాబును టార్గెట్ చేస్తే బాగుంటుంది కానీ.. ఔట్ డేటెడ్ పొలిటీషియన్ తో ప్రెస్ మీట్ పెట్టిస్తే మేము ఏమీ ప్రమోషన్ చేయాలని వైసీపీ యూత్ విభాగం ఆవేదన వ్యక్తం చేస్తోందట.. ఇప్పటికైనా వైసీపీ ఫైర్ బ్రాండ్స్ తో చంద్రబాబుపై చెడుగుడు ఆడాలని సూచిస్తున్నారు.