యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Pics.

తెలుగునౌ.కాం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

యూట్యూబ్ తో డబ్బులు సంపాదించే అవకాశం.. ఈ సూపర్ ఫీచర్ తో..?

0

దేశంలో స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. జియో ఫోన్ లాంటి ఫీచర్ ఫోన్లు సైతం యూట్యూబ్ లో వీడియోలను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దేశంలో వేల సంఖ్యలో యూట్యూబ్ ఛానెళ్లు ఉండగా కొంతమంది యూట్యూబ్ ద్వారా లక్షల్లో డబ్బు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది.

సూపర్ థ్యాంక్స్ పేరుతో యూట్యూబ్ తెచ్చిన ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లకు వీక్షకులు 150 రూపాయల నుంచి 3730 రూపాయల వరకు చెల్లించే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫీచర్ ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించాలనుకునే వీక్షకులు క్రియేటర్లకు డబ్బును చెల్లించడం జరుగుతుంది. కొత్తగా యూట్యూబ్ క్రియేటర్లుగా మారేవాళ్లకు సైతం ఈ విధంగా డబ్బులు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది.

వీడియోలకు భారీగా డిమాండ్ ఉండటంతో షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ ను తెచ్చేందుకు చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్ లలో షార్ట్ వీడియోలు అందుబాటులో ఉండగా భారత్ లోకి టిక్ టాక్ రీఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. క్రియేటర్లను మరింతా ప్రోత్సహించాలనే సదుద్దేశంతో యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 68 దేశాలలో యూట్యూబ్ ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.

క్రియేటర్లు ఈ ఫీచర్ వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా డబ్బులు డొనేట్ చేసిన వాళ్లు కామెంట్ సెక్షన్ లో హైలెట్ గా కనపడనున్నాయి.