మిలియన్ మార్క్ ని అందుకున్న మెగాస్టార్…!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ లో సోషల్ మీడియా మాధ్యమాలలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఒకేసారి ట్విట్టర్ – ఫేస్బుక్ – ఇన్స్టాగ్రామ్ లలో ఖాతాలు ఓపెన్ చేశారు చిరంజీవి. అయితే మెగాస్టార్ రావడం లేట్ అయినా సోషల్ మీడియాలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. నిజానికి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో చాలా తక్కువ మంది టాప్ స్టార్స్ మాత్రమే రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా పెద్దగా పోస్ట్స్ చేయకపోవచ్చు అనుకున్నారు. అలానే చిరు సోషల్ మీడియా ట్రోల్స్ ఎలా తట్టుకొని నిలబడతాడో అని మెగా అభిమానులు కలవరపడ్డారు.

అయితే చిరు మాత్రం సోషల్ మీడియా ఎంట్రీతోనే పోస్టులతో సోషల్ మీడియాని హోరెత్తించారు. ప్రస్తుత పరిస్థితులపై స్పందించడమే కాకుండా.. తన జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు సీసీసీ కి సంభందించిన వివరాలు వెల్లడించడం.. కరోనా విపత్కర పరిస్థితుల్లో తన సందేశాలతో ప్రజల్లో చైతన్యం కల్పించడం.. ప్రముఖుల బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పడం.. సినీ అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే విషయాలు కూడా వెల్లడిస్తూ వస్తున్నారు. దీంతో రోజు రోజుకు చిరంజీవిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంస్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని అందుకున్నాడు. అయితే చిరు మాత్రం ఇన్స్టాలో ఎవరిని ఫాలో అవడం లేదు. ఇక ఇంస్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 51 పోస్టులు పెట్టిన చిరు లేటెస్టుగా గుండుతో ఉన్న ఫోటో పోస్ట్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. అలానే ట్విట్టర్ లో చిరుని 7 లక్షలకు పైగా అనుసరిస్తున్నారు.