Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘విక్రమ్ వేధా’ రీమేక్ నుంచి అమీర్ ఔట్.. రీజన్ ఇదే

‘విక్రమ్ వేధా’ రీమేక్ నుంచి అమీర్ ఔట్.. రీజన్ ఇదే


ఇప్పుడు బాలీవుడ్ కు సౌత్ ఫీవర్ పట్టుకుంది. వరుసగా దక్షిణాది చిత్రాలను రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. 2017లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ్ థ్రిల్లర్ ‘విక్రమ్ వేధా’ మూవీని కూడా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్ట వార్తలు వచ్చాయి. ఈ రీమేక్ లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారనే వార్త చక్కర్లు కొట్టింది.

ఈ తమిళ్ బ్లాక్ బస్టర్ లో మాధవన్ విజయ్ సేతుపతి నటించారు. బాలీవుడ్ రీమేక్ లో మాధవన్ పాత్రలో అమీర్ ఖాన్ సేతుపతి రోల్ లో సైఫ్ కనిపించనున్నారని ప్రచారం జరిగింది. అయితే.. తాజా సమాచారం మేరకు అమీర్ ఖాన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడట.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు నో చెప్పాడట అమీర్. అయితే.. సైఫ్ అలీఖాన్ మాత్రం ఇంకా ఈ ప్రాజెక్ట్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడని సమాచారం. సో.. అమీర్ ఖాన్ ప్లేస్ లో ఎవరు తెరపైకి వస్తారు? అనే చర్చ బాలీవుడ్ లో నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత.. అనేది తేలాలంటే ఈ రీమేక్ గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. తమిళ ఒరిజినల్కు దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రిలే హిందీ రీమేక్ను తెరకెక్కించనున్నట్టు సమాచారం.