కరోనా మహిమ.. ఆ నటి దొంగగా మారింది!

0

కరోనా సినిమా వాళ్ళను భలే దెబ్బతీసింది. సినిమాల షూటింగ్ ఆగిపొయి ఎంతోమంది నటీనటులు రోడ్డున పడ్డారు. ఒకప్పుడు బాగా సంపాదన ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు జీవనోపాధి కోసం తోపుడు బండ్లు పెట్టుకుని పండ్లు కూరగాయలు కూడా అమ్ముతున్నారు. ఓ సీరియల్స్ నటి సినిమాలు లేక దొంగగా మారింది. తన ప్రియుడిని రెచ్చగొట్టి దొంగతనం చేయించింది. ఇప్పుడు పోలీసు కేసులో చిక్కుకుంది.

దేవత సహా పలు సీరియళ్లల్లో నటించిన సుచిత్ర తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె మణికందన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.చెన్నైలో ఉంటున్న ఇతడు టీవీ సినీ నటులకు డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇతడికి ఇంతకు ముందే పెళ్లి అయింది. అయినా సుచిత్ర చెన్నైలో ఉంటూ అతడితో సహజీవనం చేస్తోంది. కరోనా కారణంగా ఉన్న అవకాశాలు అన్ని ఆగిపోవడంతో సుచిత్ర విల విలలాడుతోంది. ప్రియుడు మణికందన్ ను రెచ్చగొట్టి దొంగతనం చేయించింది. ప్లాన్ వేసి మణికందన్ తల్లిదండ్రుల ఇంట్లోనే చోరీకి పురమాయించింది.

కడలూరు జిల్లాలో ఉండే తల్లిదండ్రులు ఇంట్లో మణికందన్ యాభై వేల నగదు18 సవరాల బంగారం చోరీ చేశాడు. దీనిపై మణికందన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణికందన్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సుచిత్ర కోసం గాలిస్తున్నారు.