హార్ట్ ఎటాక్ బ్యూటీ సొంత ప్రయోగం

0

నితిన్.. పూరిల హార్ట్ ఎటాక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అదా శర్మ. ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు ముందు ఉంటున్నా కూడా అవకాశాల విషయంలో వెనకబడి పోయింది. మొదటి సినిమా నిరాశ పర్చడంతో ఆ తర్వాత చిన్న చిన్న ఆఫర్లు అందిపుచ్చుకుంది. అయినా కూడా సక్సెస్ మాత్రం కాలేక పోయింది. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో తన యోగా ఆసనాలు.. హాట్ ఫొటో షూట్ లతో సందడి చేస్తూనే ఉన్న ఈ అమ్మడికి తెలుగులో ఎట్టకేలకు ‘?’ అనే సినిమాలో ఛాన్స్ దక్కింది.

టైటిల్ విభిన్నంగా ఉండటంతో ఇదేం సినిమా అంటూ అంతా చర్చించుకుంటూ సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. ఈ సినిమాలో తెలంగాణ పిల్లగా అదా శర్మ కనిపించబోతుంది. ఇక ఈ సినిమాలోని తన పాత్ర కోసం తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు అదా శర్మ తెలుగు నేర్చకుంటుందట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. సాదారణంగా తెలుగులో మాట్లాడటమే కష్టం.. అది తెలంగాణ యాసలో అంటే మరింత కష్టమైన పని. అంత కష్టమైన పనిని స్వయంగా అదా శర్మ చేసేందుకు సిద్దం అవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటీ అనేది చూడాలి.

తెలుగు హీరోయిన్స్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. మరి ఈ అమ్మడు సొంత డబ్బింగ్ తో సినిమాకు ఏమైనా క్రేజ్ ను తెచ్చి పెడుతుందా చూడాలి. ఈ సినిమా థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరి ఈ సినిమాతో అయినా అదా శర్మ టాలీవుడ్ లో బిజీ అయ్యేనో చూడాలి.