Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రముఖ ఓటీటీలకు పోటీగా నిలిచిన ‘ఆహా’…!

ప్రముఖ ఓటీటీలకు పోటీగా నిలిచిన ‘ఆహా’…!


కరోనా పుణ్యమా అని దేశవ్యాప్తంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా పెరిగిందని చెప్పవచ్చు. ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్ వెబ్ సిరీస్ చూడటానికే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీక్షకులకు అనేక డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ అందుబాటులో తీసుకొచ్చారు. భవిష్యత్ లో ఓటీటీల ప్రభావాన్ని ముందే ఊహించి ఓటీటీ వరల్డ్ లోకి ప్రవేశించారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. వంద శాతం తెలుగు యాప్ అంటూ ”ఆహా” ఫ్లాట్ ఫార్మ్ ని క్రియేట్ చేశారు. తెలుగు సినిమాలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి పెడుతూ ఇతర ఓటీటీలకు పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

‘ఆహా’ కంటే ముందు ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ మంచి ఆదరణ తెచ్చుకుంది. అయితే ఈ మధ్య తెలుగు సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసే విషయంలో మాత్రం కాస్త వెనుక పడ్డారని ఓటీటీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఏ సినిమాకి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. అదే సమయంలో ఈ లోటుని ‘ఆహా’ టీమ్ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇతర భాషల్లో హిట్ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడంతో పాటు.. తెలుగు కామెడీ అండ్ ఫ్యామిలీ సినిమాలని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తూ ఆదరణ పొందుతున్నారు. ఈ మధ్య ఆహాలో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అప్లోడ్ చేస్తుండటంతో యూత్ కూడా ఇప్పుడు ‘ఆహా’ వైపు మల్లుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ స్క్రైబర్స్ ని వ్యూవర్ షిప్ ని పెంచుకుంటూపోతోంది. ఈ విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియోకి తెలుగు రాష్ట్రాల్లో ‘ఆహా’ ఫ్లాట్ ఫార్మ్ గట్టి పోటీనిస్తూ దూసుకుపోతోందని చెప్పవచ్చు.