‘ఆహా’ వేదికగా సమంత ‘సామ్ జామ్’ టాక్ షో..!

0

అక్కినేని సమంత ఇటీవల ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4కు పార్ట్ టైం హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దసరా స్పెషల్ లో రియాలిటీ షో కి హోస్ట్ గా చేసి సామ్.. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ టాక్ షో తో ఫుల్ టైమ్ హోస్ట్ గా రాబోతోంది. సినిమాలు వెబ్ సిరీస్ లతోనే కాకుండా స్పెషల్ టాక్ షోలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం సమంత ఓ టాక్ షో చేస్తోంది. ”సామ్ జామ్” అనే టాక్ షో కు సమంత హోస్ట్ చేస్తారని ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. దీపావళి సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి ‘సామ్ జామ్’ టాక్ షో ప్రసారం కానుందని తెలుస్తోంది.

కాగా ‘సామ్ జామ్’ టాక్ షో లో మెగాస్టార్ చిరంజీవి – అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ – తమన్నా భాటియా – రష్మిక మందన్న – సైనా నెహ్వాల్ వంటి సెలబ్రిటీలతో అక్కినేని సమంత మాట్లాడనుంది. ఈ టాక్ షోకి దర్శకురాలు నందిని రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిందీలో బాగా పాపులర్ అయిన ‘కాఫీ విత్ కరణ్’ షో మాదిరిగా ‘సామ్ జామ్’ టాక్ షో ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో ఎపిసోడ్ కి సమంతకి 40 లక్షల వరకు ఇస్తున్నారట. హీరోయిన్ గా సక్సెస్ అయిన సమంత ఇప్పుడు సక్సెస్ ఫుల్ హోస్ట్ అనిపించుకుంటుందేమో చూడాలి. తాజాగా ‘సామ్ జామ్’ షో గురించి వివరాలు వెల్లడించిన సామ్ ‘ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదని.. సమాజంలోని సమస్యల గురించి ప్రశ్నించడం.. టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం వంటివి ఇందులో ప్రేక్షకులు చూడవచ్చ’ని తెలిపింది. ఏదేమైనా ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ‘ఆహా’ డైరెక్ట్ సినిమాల రిలీజులతో పాటు ఇలాంటి స్పెషల్ షో లతో క్రేజ్ ని పెంచుకుంటోందని చెప్పవచ్చు.