అందులో మాత్రం అక్కినేని ముగ్గురు హీరోలు ఫస్ట్!

0

కరోనా వచ్చినప్పటి నుంచి షూటింగులన్నీ ఆగిపోయాయి. ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇచ్చి నెలలు గడిచాయి. అయినా ఇన్ని రోజులు షూటింగ్ జరుపుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక ఇప్పట్లో పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలు కనిపించకపోవడంతో చిన్న మీడియం సినిమాలు నిర్మిస్తున్నవారు తమ చిత్రాల షూటింగ్ మొదలు పెడుతున్నారు. అక్కినేని హీరోలు ఈ విషయంలో అందరికంటే ముందున్నారు. నాగార్జున ఇప్పటికే ‘వైల్డ్ డాగ్ ‘ షూటింగ్ లో నిమగ్నమవగా నాగచైతన్య శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న ‘లవ్ స్టోరీ ‘ సినిమా కూడా పట్టాలెక్కింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ఓ వాటర్ ఫాల్స్ వద్ద షూటింగ్ జరుపుతున్నారు.

ఇక అక్కినేని అఖిల్ కూడా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజాహెగ్డే తన కార్వాన్లో నిల్చున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో షూటింగ్ మొదలైనట్టు కన్ఫర్మ్ అయింది. ఆ ఫోటో లో పూజా హెగ్డే మాస్కు పీపీఈ కిట్ ధరించి సిబ్బంది పక్కన నిల్చుని ఉంది. సినిమా ఇంకా నెల రోజుల పాటు షూటింగ్ జరగాల్సి ఉంది. అక్టోబర్ నాటికి సినిమాను పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అగ్ర హీరోలెవరూ తమ సినిమాల షూటింగ్ మొదలుపెట్టక పోగా అక్కినేని కుటుంబంలో ముగ్గురు హీరోలు షూటింగ్లో బిజీగా ఉండడం విశేషం. చాలామంది నిర్మాతలు ఆగిపోయిన తమ సినిమాల షూటింగ్ తిరిగి మొదలు పెట్టి సంక్రాంతి కల్లా సిద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నారు.