Templates by BIGtheme NET
Home >> Cinema News >> సరిపోదా శనివారం.. న్యూ హైప్!

సరిపోదా శనివారం.. న్యూ హైప్!


నేచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. అలాగే హాయ్ నాన్న మూవీతో మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా నానిని వరుస విజయాలు వరిస్తున్నాయి. కొత్త దర్శకులతో చేసిన కూడా సక్సెస్ లు వెతుక్కుంటూ వస్తున్నాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ మూవీస్ చేయడం వలన నాని మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతోంది.

ప్రస్తుతం అతనికి నిర్మాతల్లో మంచి నమ్మకం ఏర్పడింది. టైర్ 2 హీరోలలో 40 కోట్లకి పైగా పెట్టుబడి పెట్టిన తిరిగి వస్తాయనే నమ్మకం ఉన్న స్టార్ అంటే నాని ఒక్కడే కనిపిస్తున్నాడు. అందుకే నిర్మాతలు కూడా నానితో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.

డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే గ్లింప్స్ చూసిన వారు సరిపోదా శనివారం యాక్షన్ బ్యాక్ డ్రాప్ రివేంజ్ మూవీ అని అనుకున్నారు. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ సరిపోదా శనివారం మూవీ నుంచి ఫ్యామిలీ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ లో సాయి కుమార్, నేచురల్ స్టార్ నాని ఉండటం విశేషం. సాయి కుమార్ ట్రెడిషనల్ డ్రెస్ లో ఉండగా నాని కుర్తాలో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ బట్టి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చక్కగా ప్రెజెంట్ చేశాడని అర్ధమవుతోంది. వివేక్ ఆత్రేయ గత సినిమాలలో కూడా ఫ్యామిలీ ఎలిమెంట్స్ కి మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే సరిపోదా శనివారం సినిమాలో కూడా బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ని కథలో భాగంగా చూపించబోతున్నాడంట. ఫ్యామిలీ అండ్ యాక్షన్ జోనర్ లో ఈ సినిమాని తెరకెక్కించాడని తెలుస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. ఆగష్టు 29న థియేటర్స్ లోకి రాబోయే ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.