స్టార్ హీరోను భయపెడుతున్న అమెజాన్ బ్యాడ్ సెంటిమెంట్

0

ఇండియాలో ఓటీటీ బిజినెస్ పీక్స్ కు వెళ్లేందుకు కనీసం అయిదు నుండి పది సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని భావిస్తున్న సమయంలో కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఎంటర్ టైన్మెంట్ కరువయ్యింది. దాంతో జనాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై పడ్డారు. ప్రముఖ ఓటీటీలు అన్ని కూడా భారీగా సబ్ స్రైబర్స్ ను సొంతం చేసుకున్నాయి. కొత్త సినిమాలను నేరుగా విడుదల చేసేందుకు ఓటీటీలు అన్ని కూడా పోటీ పడుతున్నాయి. హిందీ తమిళం తెలుగు ఇలా అన్ని భాషల సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీకి ముందుకు వస్తున్నాయి.

బాలీవుడ్ సినిమాలు ఇప్పటి వరకు ఎక్కువగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. తెలుగులో నేడు ‘వి’ విడుదల అయ్యింది. తెలుగు నుండి విడుదలైన పెద్ద సినిమా ‘వి’ నే. అమెజాన్ లో ఇప్పటి వరకు విడుదల అయిన పెద్ద సినిమాలు అన్ని కూడా నిరాశ పర్చాయి. నాని ‘వి’ సినిమాపై అమెజాన్ మరియు ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ సినిమా తీవ్ర నిరాశ పర్చింది. ‘వి’ ఫలితంతో తమిళ స్టార్ హీరో సూర్యలో టెన్షన్ మొదలయ్యి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సూర్య ప్రతిష్టాత్మక చిత్రం ఆకాశమే నీ హద్దురా విడుదలకు రెడీ అయిన సమయంలో లాక్ డౌన్ వచ్చి విడుదల ఆగిపోయింది. ఇన్నాళ్లు వెయిట్ చేసి సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఆకాశమే నీ హద్దురా సినిమాను తమిళం మరియు తెలుగులో ఒకే సారి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అమెజాన్ లో ఇప్పటి వరకు వచ్చిన ఏ పెద్ద సినిమా కూడా సక్సెస్ అవ్వక పోవడంతో అదో బ్యాడ్ సెంటిమెంట్ గా సూర్య అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్య కూడా ఈ విషయంలో కాస్త టన్షన్ పడుతున్నాడట. సినిమాను అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక భారీగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు.