ఇంతకీ జక్కన్న కి ‘వి’ నచ్చిందా లేదా…?

0

కరోనా వైరస్ దెబ్బకు దెబ్బతిన్న రంగాల్లో చిత్ర పరిశ్రమ ముందు వరులో ఉంది. లాక్డౌన్ సమయంలో థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు థియేట్స్ ఓపెన్ అయితే చూద్దామని వెయిట్ చేసిన చిన్న సినిమాలకు.. ఒకటి రెండు మీడియం రేంజ్ సినిమాలకు డిజిటల్ మాధ్యమమే సాధనంగా మారింది. ఈ క్రమంలో విడుదలైన సినిమాలు అన్నీ దాదాపుగా ప్రేక్షకులను నిరాశపరిచినవే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ సినిమాల్లో ఒకటైన ‘వి’ చిత్రాన్ని డిజిటల్ లో విడుదల చేశారు. ఈ సినిమాలో నేచులర్ స్టార్ నాని – సుధీర్ బాబు – నివేదా థామస్ – అదితిరావు హైదరి వంటి స్టార్ కాస్ట్ నటించారు. నాని కెరీర్లో 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకి బాగానే బజ్ క్రియేట్ అయింది. కాకపోతే ఫస్ట్ డే ఫస్ట్ షో హడావిడి లేకుండా చడీచప్పుడు లేకుండా హోమ్ థియేటర్ లో చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి కూడా తన ఫ్యామిలీతో కలిసి హోమ్ థియేటర్ లో నాని ‘వి’ సినిమా చూశాడు.

కాగా రాజమౌళి తనయుడు కార్తికేయ ‘వి’ సినిమాని చూస్తున్న విషయాన్ని ట్విట్టర్ లో చెప్తూ ఓ ఫోటో కూడా షేర్ చేశాడు. ‘V’ మూవీ FDFS హంగామా మిస్సవుతున్నాం.. సాధారణ పరిస్థితులు ఉంటే మనమందరం ప్రసాద్ ఐమాక్స్ లో 8.45 AM షో చూసే వాళ్ళం. అయితే ఇది కూడా సరదాగా ఉంటుందని అనిపిస్తుందని పేర్కొన్నాడు కార్తికేయ. ‘వి’ చిత్రాన్ని కార్తికేయతో పాటుగా రాజమౌళి – రమా రాజమౌళి – కాలభైరవ – సింహా – సాయి కొర్రపాటి మరియు రాజమౌళి ఇతర ఫ్యామిలీ మెంబెర్స్ చూసినట్లుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి ఏ సినిమా చూసినా నచ్చితే సోషల్ మీడియా వేదికగా తన స్పందన వెల్లడిస్తుంటారు. అందులోనూ నానితో రాజమౌళికి స్పెషల్ బాండింగ్ కూడా ఉంది. నానితో ‘ఈగ’ సినిమా తీయడమే కాకుండా నాని కోసం ‘మజ్ను’ సినిమాలో కనిపించాడు. ఈ నేపథ్యంలో ‘వి’ ఎలా ఉందని జక్కన స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ దీనిపై ఓ ట్వీట్ కూడా చేయలేదు. సినిమా చూడటానికి ముందు ట్వీట్ చేసిన కార్తికేయ కూడా సైలెంట్ అయ్యాడు. నిజానికి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘వి’ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుంచి సినీ క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ క్రమంలో జక్కన్నకు కూడా ఈ సినిమా నచ్చలేదేమో.. అందుకే సైలెంట్ గా ఉన్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.