ఆమె కాబోయే సూపర్ స్టార్ : విజయ్ దేవరకొండ

0

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుం పూరి దర్శకత్వంలో ఫైటర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మార్చి వరకు ముంబయిలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా నిలిచి పోయింది. త్వరలోనే పునః ప్రారంభం అవ్వబోతున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి త్వరలోనే అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఆమెతో కలిసి వర్క్ చేసింది కొన్ని రోజులే అయినా కూడా ఆమె గురించి విజయ్ దేవరకొండ చాలా ఎక్కువగానే అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది.

తాజాగా ఈ రౌడీ స్టార్ ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ హీరోయిన్ అనన్య పాండేపై ప్రశంసలు కురిపించాడు. ఆమె కాబోయే సూపర్ స్టార్ అన్నాడు. ఆమె చాలా గొప్ప ప్రతిభావంతురాలు అంటూ పేర్కొంది. బాలీవుడ్ లో ఈ ఏడాది పలు సినిమాల్లో నటిస్తున్న ఈమె వచ్చే ఏడాదిలో నాలుగు అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తెలుగులో ఈమె ఫైటర్ సినిమాలో నటిస్తుంది. సౌత్ లో మరిన్ని ఆఫర్లు వస్తే చేసేందుకు సిద్దంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండతో నటిస్తున్న సినిమా సక్సెస్ అయితే తెలుగులో కూడా అనన్య మోస్ట్ వాంటెడ్ గా మారే అవకాశం ఉంది.