కిల్లింగ్ లుక్ తో రౌడీ ఫ్యాన్స్ నే కిల్ చేస్తుందా?

0

అనన్య పాండే .. కిల్లింగ్ లుక్ తో కుర్రకారును పరేషాన్ చేస్తున్న బాలీవుడ్ యువనాయిక. నటుడు చుంకీ పాండే వారసురాలిగా.. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ సంరక్షణలో అనన్య కెరీర్ రూపుదిద్దుకుంటోంది. నటవారసులను స్టార్లుగా తీర్చిదిద్దే కరణ్ అనన్య విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ కనబరచడంపై దివంగత సుశాంత్ సింగ్ అభిమానులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ లో నటవారసురాళ్లు జాన్వీ- సారా అలీఖాన్ వీళ్లందరితో పోటీపడుతూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది అనన్య. కరణ్ జోహార్ గత ఏడాది ఈ అమ్మడిని బాలీవుడ్ కి పరిచయం చేశాడు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` లో మరో భామతో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంది. తొలి సినిమాలో కాలేజ్ విద్యార్థిగా ఆకట్టుకుంది. వరుసగా భారీ చిత్రాల్లో అనన్యకు ఆఫర్లు ఇస్తున్నాడు కరణ్.

ప్రస్తుతం రౌడీ విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా మూవీ `ఫైటర్` లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశాడు పూరి. దేవరకొండతో అనన్య కెమిస్ట్రీకి సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. మహమ్మారీ ముంబైని అట్టుడికించేస్తుండడంతో షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం హైదరాబాద్ కి షూట్ ని షిఫ్ట్ చేశారు. అనన్య ముంబై నుంచి ఇక్కడికి చేరుకుని షూటింగుల్లో పాల్గొంటోందా లేదా? అన్నది చూడాలి. ఇటీవల అనన్య పాండే నటించిన ఖలీ పీలీ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజై డిస్ లైక్స్ పాలవ్వడం చర్చకొస్తోంది. ఈ రిజల్ట్ నటవారసురాలు.. తనని ఎంకరేజ్ చేసే ధర్మ అధినేతపై కోపంతోనే అన్నది చెప్పాల్సిన పనే లేదు. తాజాగా సోషల్ మీడియాల్లో అనన్య షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. స్టన్నింగ్ లుక్ తో రౌడీ ఫ్యాన్స్ ని కిల్ చేస్తోంది అంతే.