ఆండ్రియా ఊరించే అందాన్ని..!

0

థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సింగర్ ఆండ్రియా ఆ తరువాత గాయని కం నటిగా రాణించింది. ఐదున్నర అడుగుల హంపీ శిల్పంలా తళుక్కుమనే ఆండ్రియా అందచందాలకు ముగ్ధులు కాని వాళ్లే లేరు. గ్లామర్ ఎక్స్ పోజింగ్ దేనికైనా రెడీ. హీటెక్కించే సన్నివేశాల్లో అయినా నటించడానికి అభ్యంతరం చెప్పని ఈ అమ్మడు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచంద్రన్ తో లిప్ లాక్ వేసిన ఫోటోలు సంచలనం అయ్యాయి. వీరి ప్రైవేట్ ప్రేమకలాపానికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నేట్ ని ఓ దశలో షేక్ చేశాయి.

నటిగా.. సింగర్ గా తెలుగు- తమిళ- మలయాళ భాషల్లో ఇరగ దీసేస్తోంది. సీనియర్ హీరో కమల్ తోనూ విశ్వరూపం లో రెచ్చిపోయి లిప్ లాక్ సీన్ లలో నటించి ఆశ్చర్యపరిచిన ఆండ్రియా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమ బిజీగా వుంది. ప్రస్తుతం తమిళంలో ఆండ్రియా చేతిలో మొత్తం ఏడు చిత్రాలున్నాయి.

అందులో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న `మాస్టర్` చిత్రంతో పాటు `అరణ్మనై 3`.. నో ఎంట్రీ వంటి హారర్ థ్రిల్లర్ చిత్రాలు కూడా వున్నాయి. చేతినిండా సినిమాలతో యమ బిజీగా వున్న ఆండ్రియా తాజాగా ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. వైట్ టాప్.. టైట్ జీన్స్ లో మత్తెక్కించే చూపుల్పి విసురుతూ కిర్రెక్కించేస్తోంది. ఆండ్రియా అందాలకు కుర్రకారు దాసోహం అంటున్నారు. ఆమె నటిస్తున్న `నో ఎంట్రీ` థ్రిల్లర్ త్వరలో డిజిటల్ వరల్డ్ లో రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది.