జయప్రకాష్ రెడ్డి ఫ్యామిలీకి బాలయ్య రూ.10 లక్షల సాయం

0

ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి నిన్న ఉదయం బాత్ రూంలో గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి వార్త సినీ ప్రముఖులకు తీవ్ర దిగ్రాంతిని కలిగించింది. ఎంతో ఆరోగ్యంగా ఉండి ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూనే ఉన్న జయప్రకాష్ రెడ్డి మృతి వార్తను సినీ జనాలు జీర్ణించుకోలేక పోతున్నారు. కెరీర్ ఆరంభంలో విలన్ గా నటించిన జేపీ ఈమద్య కాలంలో ఎక్కువగా కమెడియన్ పాత్రలే చేసి మెప్పించాడు. ఆయన్ను చూస్తేనే నవ్వు వస్తుంది అంటూ ప్రేక్షకులు అంటూ ఉంటారు. అలాంటి గొప్ప నటుడు జయప్రకాష్ రెడ్డి మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇదే సమయంలో నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ జయప్రకాష్ రెడ్డి కుటుంబంకు ఆర్థికంగా భరోసాగా నిలిచేందుకు గాను రూ.10 లక్షల సాయంను ప్రకటించాడు.

బాలకృష్ణ సూపర్ డూపర్ హిట్ చిత్రాలైన చెన్న కేశవరెడ్డి.. నరసింహనాయుడు సినిమాలతో పాటు ఇంకా పలు ఫ్యాక్షన్ సినిమాల్లో జయప్రకాష్ రెడ్డి విలన్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా సమరసింహారెడ్డి సినిమాలో జేపీ పాత్ర సూపర్. సినిమా విజయంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అందుకే జయప్రకాష్ రెడ్డి అంటే బాలకృష్ణ కు ప్రత్యేకమైన అభిమానం. ఆ కారణంగానే ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాగా నిలిచే ఉద్దేశ్యంతో పదిలక్షల సాయం చేశాడంటూ బాలయ్య సన్నిహితులు అంటున్నారు. ఇలాంటి సమయంలో జేపీ ఫ్యామిలీని ఆదుకోవడం అంటే నిజంగా అభినందనీయం. బాలయ్య మంచి మనసుకు ఇది నిదర్శణం అంటూ నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.