బిబి4 బిగ్ న్యూస్ : దేవి రీ ఎంట్రీ

0

బిగ్ బాస్ నుండి మూడవ వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన దేవి నాగవళ్లి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ లోనికి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎలిమినేట్ అయ్యింది అంటూ ప్రకటించిన సమయంలోనే ఫేక్ ఎలిమినేషన్ అయ్యి ఉంటుంది.. మళ్లీ ఆమెను పంపిస్తారేమో అనుకున్నారు. కాని ఎలిమినేషన్ తర్వాత బయటకు వచ్చి గత వారం రోజులుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మళ్లీ ఛాన్స్ ఇస్తే వెళ్తారా అంటూ పలువురు ప్రశ్నించగా అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. కాని ఈ కరోనా సమయంలో మళ్లీ రెండు వారాల క్వారెంటైన్ ఉండాల్సి ఉంటుంది కనుక అది టెక్నికల్ గా సాధ్యం కాకపోవచ్చు అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

ఆమె కోసం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆమెను తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి తీసుకోవాలంటూ బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. బిగ్ బాస్ గత సీజన్ లో ఎలిమినేట్ అయిన వారిని మళ్లీ తీసుకోవడం మనం చూశాం. ఈసారి కూడా అలాగే దేవిని తీసుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి. దేవి ఎలిమినేషన్ నేపథ్యంలో ప్రేక్షకులు మొత్తం ఎలిమినేషన్ పక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆమె కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారు హౌస్ లో ఉండగా ఆమె ఎలిమినేట్ అయ్యిందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. దేవి కూడా అదే వాదన వినిపిస్తుంది. అందుకే తమపై అపవాదు ఉండవద్దనే ఉద్దేశ్యంతో కూడా ఆమెను మళ్లీ తీసుకునే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. శనివారం లేదా ఆదివారం ఎపిసోడ్ వరకు ఆమె ఎంట్రీ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.