బిబి4 లీక్ : కుమార్ సాయి ఎలిమినేషన్!?

0

తెలుగు బిగ్ బాస్ ఆరు వారాలు పూర్తి అయ్యింది. మొదటి అయిదు వారాల్లో అయిదుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే అయిదుగురిలో నలుగురు అమ్మాయిలే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమ్మాయిలు ఇప్పటి వరకు బిగ్ బాస్ విజేత అవ్వలేదు. బిగ్ బాస్ నిర్వాహకులు ఏమైనా అమ్మాయిలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు పెరుగుతున్నారు. ఆరవ వారంలో కూడా అయిదవ లేడీని ఎలిమినేట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ నిర్వాహకులు భావించి మోనాల్ కు తక్కువ ఓట్లు వచ్చినా కూడా కుమార్ సాయిని ఎలిమినేట్ చేసినట్లుగా మీడియా వర్గాల నుండి సమాచారం అందుతోంది.

కుమార్ సాయి షో మొదటి వారం పూర్తి అయిన వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే కుమార్ సాయి ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యాడు. అప్పటి నుండి మద్యలో ఒక్కసారి కెప్టెన్ అవ్వడం వల్ల నామినేట్ అవ్వలేదు కాని వరుసగా నాలుగు సార్లు నామినేట్ అయ్యాడు. మొదటి మూడు సార్లు కరాటే కళ్యాణి.. దేవి.. స్వాతిలు వెళ్లి పోవడంతో కుమార్ సాయి సేవ్ అయ్యాడు. ఈసారి ఆయన ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఈసారి కూడా ఈయన కంటే మోనాల్ కు తక్కువ ఓట్లు వచ్చాయట. కాని మోనాల్ వల్ల ఇంట్లో ఒక రకమైనా వాతావరణం క్రియేట్ అవుతుందని.. ఆమె వల్ల ఫుటేజ్ లభిస్తుందని కూడా భావించారు. కనుక ఆమెను ఉంచాలని భావించారట. దానికి తోడు అందరు అమ్మాయిలే ఎలిమినేట్ అవుతున్నారు అంటే హౌస్ లో బ్యాలెన్స్ తప్పుతుందనే ఉద్దేశ్యం కూడా అయ్యి ఉండవచ్చు అంటున్నారు. అందుకే ఈసారి అబ్బాయిల్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలని భావించారట. నామినేట్ అయిన అబ్బాయిల్లో కుమార్ సాయి వీక్ అవ్వడంతో అతడిని బయటకు తీసుకు వచ్చారని మీడియా సర్కిల్స్ లో టాక్. నేటి ఎపిసోడ్ లో కుమార్ సాయి ఎలిమినేషన్ ను ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా లీక్ నిజం అవుతుందా లేదంటే ఈసారి ఏమైనా కొత్తగా జరుగుతుందా అనేది చూడాలి.