రెట్రో లుక్ బావుంది శీనూ!!

0

భారీ మాస్ యాక్షన్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్. పోలీస్ అధికారి పాత్రలోనూ మెప్పించాడు. ఇప్పుడు ఉన్నట్టుండి రెట్రో లుక్ లో సడెన్ షాకిచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `అల్లుడు అదుర్స్`. `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ పునః ప్రారంభం అయింది. ఏడు నెలల విరామం తరువాత షూటింగ్ లు తిరిగి ప్రారంభం కావడంతో ఈ సినిమా సెట్ లోనూ సందడి మొదలైంది.

ఈ మూవీ కోసం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రెట్రో లుక్ లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. కంప్లీట్ 1970 80 కాలం నాటి లుక్ లో బెల్లంకొండ అదరగొట్టేశాడు. లైట్ గడ్డం.. మెలితిప్పిన కోర మీసాలు.. రౌండ్ అద్దాల గాగుల్స్ ధరించి శ్రీనివాస్ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాడు. రెట్రో లుక్ టెర్రిఫిక్ గా వుంది. సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. ఒక రకంగా మీసగాడు రోషగాడితో పెట్టుకోవద్దు అన్నట్టుగానే ఉందీ లుక్

బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంలో హిలేరియస్ అనిపించే క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. సోను సూద్ – ప్రకాష్ రాజ్ లాంటి విలన్లు పెద్ద అస్సెట్ కానున్నారు. వెన్నెల కిషోర్ ..కామెడీ అస్సెట్ కానుంది. వీళ్లతో బెల్లంకొండ శ్రీనివాస్ చేసే సన్నివేశాలు హైలైట్ గా నిలవనున్నాయట. `అల్లుడు అదుర్స్` షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇది చివరి షెడ్యూల్. సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ టీజర్ త్వరలోనే రిలీజ్ కానుంది.